Share News

రచయిత్రి చక్కిలం విజయలక్ష్మి కన్నుమూత

ABN , First Publish Date - 2023-10-18T05:20:56+05:30 IST

ప్రముఖ నవలా రచయిత్రి చక్కిలం విజయలక్ష్మి (75) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె కర్నూలులో స్వగృహంలో సోమవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత తుదిశ్వాస విడిచారు.

రచయిత్రి చక్కిలం విజయలక్ష్మి కన్నుమూత

కర్నూలు కల్చరల్‌, అక్టోబరు 17: ప్రముఖ నవలా రచయిత్రి చక్కిలం విజయలక్ష్మి (75) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె కర్నూలులో స్వగృహంలో సోమవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత తుదిశ్వాస విడిచారు. ఆమె కుమారులు హేమంత్‌శర్మ, ప్రవీణ్‌ శర్మ మంగళవారం నగర సమీపంలోని జోహరాపురం శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. కర్నూలు కేవీఆర్‌ మహిళా డిగ్రీ కళాశాలలో చదువుకున్న చక్కిలం విజయలక్ష్మి చదువుకునే నాటి నుంచే సాహిత్యం వైపు దృష్టి మరల్చారు. భర్త చక్కిలం శ్రీనివాసరావు ప్రోత్సాహంతో 1973 నుంచీ ఆమె సాహిత్యంలో తనదైన ప్రస్థానాన్ని సాగించారు. ఆసంవత్సరం తొలి నవల హేమంతగానం పుస్తక రూపంలో తీసుకువచ్చారు. మరుభూమిలో మల్లెతీగలు, తల్లిదండ్రులూ తీర్పు మీదే, శాంతి తీరం, బిందు, ఇదేమి న్యాయం, తెర తీయగ రాదా, ఈ రాగానికి అదే తాళం, చిన్నారి చెల్లి రచనలు పలు పత్రికలలో సీరియల్స్‌గా వచ్చి ఆమెను అగ్ర రచయిత్రుల సరసన కూర్చుండబెట్టాయి. మొత్తం 14నవలలు రాసిన ఆమె వందలాది కథలు, కథానికలు కూడా రాశారు.

Updated Date - 2023-10-18T05:21:42+05:30 IST