Share News

Bhadrachalam: వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భద్రాద్రి రామయ్య ఆదాయం రూ.67,31,342

ABN , Publish Date - Dec 29 , 2023 | 05:54 PM

ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి దేవస్థానం ఇటీవల నిర్వహించిన వైకుంఠ ఏకాదశి అధ్యయన ఉత్సవాలలో భారీగా ఆదాయం సమకూరింది. మొత్తం ఆదాయం రూ.67,31,342 వచ్చిన ఆలయ అధికారులు వెల్లడించారు. టికెట్ల విక్రయం ద్వారా రూ.32,79,750, లడ్డూ ప్రసాదం ద్వారా రూ.25,06,450, వసతి గృహాల ద్వారా రూ.2,34,000 వచ్చిందని అధికారులు వెల్లడించారు.

Bhadrachalam: వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భద్రాద్రి రామయ్య ఆదాయం రూ.67,31,342

భద్రాచలం: ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి దేవస్థానం ఇటీవల నిర్వహించిన వైకుంఠ ఏకాదశి అధ్యయన ఉత్సవాలలో భారీగా ఆదాయం సమకూరింది. మొత్తం ఆదాయం రూ.67,31,342 వచ్చిన ఆలయ అధికారులు వెల్లడించారు. టికెట్ల విక్రయం ద్వారా రూ.32,79,750, లడ్డూ ప్రసాదం ద్వారా రూ.25,06,450, వసతి గృహాల ద్వారా రూ.2,34,000 వచ్చిందని అధికారులు వెల్లడించారు. ఇక ఆర్జిత సేవల ద్వారా రూ.7,21,134 ఆదాయాన్ని గడించినట్టు వివరించారు.

మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం దుగినేపల్లి గ్రామంలోని శివాలయంలో దొంగలు పడ్డారు. హుండీ పగలగొట్టి నగదు చోరీ చేశారు. ఈ ఘటనపై నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Updated Date - Dec 29 , 2023 | 05:54 PM