బావమరిది చేతిలో బావ హతం

ABN , First Publish Date - 2023-06-04T01:01:45+05:30 IST

భూసమస్యపై మాట్లాడుకుందామని బావను ఇంటికి పిలిచి హ త్యచేసిన బావమరిది పోలీసులకు లొంగిపోయాడు.

 బావమరిది చేతిలో బావ హతం
ఆంజనేయులు (ఫైల్‌)

బావమరిది చేతిలో బావ హతం

పీఏపల్లి మండలం అంగడిపేట వద్ద ఘటన

పెద్దఅడిశర్లపల్లి, జూన 3: భూసమస్యపై మాట్లాడుకుందామని బావను ఇంటికి పిలిచి హ త్యచేసిన బావమరిది పోలీసులకు లొంగిపోయాడు. పీఏపల్లి మండలం అంగడిపేటలో శుక్రవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. గుడిపల్లి ఎస్‌ఐ రంజితకుమార్‌ తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. గుర్రంపోడు మండలం మొసం గి గ్రామానికి చెందిన మిడసనమెట్ల సాయన్నకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు వెంకటయ్య ఉ న్నారు. సాయన్నకు గ్రామంలో నాలుగు ఎకరాల భూమి ఉండటంతో, దా నిని కౌలుకు ఇచ్చి 20 సంవత్సరాల క్రితం హైదరాబాద్‌కు వలస వెళ్లాడు. అక్కడే ఉండి పనులు చేసుకుంటూ పిల్లలకు వివాహం చేశాడు. చిన్న కుమార్తె పారిజాతను నాగర్‌కర్నూల్‌ జిల్లా పదుర మండలం మారడుగుల గ్రామానికి చెందిన చౌట ఆంజనేయులు(35)తో వివాహం చేశాడు. వివాహ సమయంలో ఎకరం పొలాన్ని కట్నంగా ఇచ్చాడు. సాయన్న పెద్ద కుమార్తె భర్త చనిపోవడంతో ఆమెకు 30 కుంటల భూమి ఇచ్చాడు. కుమారుడు వెంకటయ్యకు భార్య, ముగ్గురు పిల్లలు కాగా, ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తూ పీఏపల్లి మండలం అంగడిపేట ఎక్స్‌రోడ్డు వద్ద ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. వెంకటయ్య మద్యానికి బానిస కావడంతో సాయన్న మిగిలిన 2.10 గుంటల భూమిని తన వద్దే ఉంచుకున్నాడు. ఆంజనేయులు కుటుంబంతో హైదరాబాద్‌లో ఉంటూ పెయింటింగ్‌ పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. బావ ఆంజనేయులు సమయం దొరికినప్పుడల్లా మీ తల్లిదండ్రులకు డబ్బు ఇచ్చానని, ఆ మిగిలిన భూమి కూడా తనకే ఇస్తారని బావమరిది వెంకటయ్యతో తరచూ చెబుతూ ఉండేవాడు. దీంతో ఉన్న నాలుగు ఎకరాల్లో 30 గుంటల భూమి పెద్ద అక్కకు పోగా, మరో ఎకరం భూమి చిన్న అక్కకు ఇవ్వగా మిగిలిన భూమి కూడా బావ ఆంజనేయులు సొంతం చేసుకుంటాడేమోననే అనుమానంతో వెంకటయ్య కక్ష పెంచుకున్నాడు. భూ సమస్య గురించి మాట్లాడుకుందామని బావ ఆంజనేయులును శుక్రవారం రాత్రి అంగడిపేటలోని తన ఇంటికి తీసుకువచ్చాడు. ఆ సమయంలో వెంకటయ్య పిల్లలు శుభకార్యం నిమిత్తం బయటకు వెళ్లగా, భార్య ఇంట్లో ఉంది. భూసమస్యపై మాట్లాడుతుండగా, ఇద్దరి మధ్య మాట మాట పెరగడంతో ఆంజనేయులు తలపై వెంకటయ్య సుత్తితో మోదడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో భార్యాభర్తల్దిరూ ఆంజనేయులు మృతదేహాన్ని మూటకట్టి అంగడిపేట ఎక్స్‌రోడ్డు గ్రామశివారులోని కాల్వ వద్ద పడేశారు. కాల్వకట్ట వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం ఉందని పోలీసులకు సమాచారం అందటంతో వెంకటయ్య శనివారం మధ్యాహ్నం గుడిపల్లి పోలీ్‌సస్టేషనలో లొంగిపోయాడు. దేవరకొం డ డీఎస్పీ నాగేశ్వర్‌రావు, కొండమల్లేపల్లి సీఐ శ్రీనివాస్‌, గుడిపల్లి, కొండమల్లేపల్లి ఎస్‌ఐలు రంజితరెడ్డి, వీరబాబు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహానికి పంచనామా నిర్వహించారు. ఆంజనేయులుకు భార్య, ఇద్ద రు కుమారులు ఉన్నారు. భార్య పారిజాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గుడిపల్లి ఎస్‌ఐ రంజితరెడ్డి తెలిపారు.

Updated Date - 2023-06-04T01:01:45+05:30 IST