రసాయన పరిశ్రమలను తరలించాలి
ABN , First Publish Date - 2023-03-15T23:42:27+05:30 IST
ప్రజల ఆరోగ్యాలను కబళిస్తున్న రసాయన పరిశ్రమలను తరలించాలని మండల పరిధిలోని దోతిగూడెం ప్రజ లు డిమాండ్ చేశారు. దోతిగూడెం గ్రా మశివారులోని రసాయన పరిశ్రమలు విడుదల చేస్తున్న వ్యర్థాలతో ప్రజలు అల్లాడుతున్నారని, వెంటనే వాటిపై చర్యలు తీసుకోవాలని ఆయా పరిశ్రమ ల ఎదుట చేపట్టిన నిరసనలు రెండో రోజుకు చేరాయి.
దోతిగూడెంవాసుల డిమాండ్
భూదాన్‌పోచంపల్లి, మార్చి 14: ప్రజల ఆరోగ్యాలను కబళిస్తున్న రసాయన పరిశ్రమలను తరలించాలని మండల పరిధిలోని దోతిగూడెం ప్రజ లు డిమాండ్ చేశారు. దోతిగూడెం గ్రా మశివారులోని రసాయన పరిశ్రమలు విడుదల చేస్తున్న వ్యర్థాలతో ప్రజలు అల్లాడుతున్నారని, వెంటనే వాటిపై చర్యలు తీసుకోవాలని ఆయా పరిశ్రమ ల ఎదుట చేపట్టిన నిరసనలు రెండో రోజుకు చేరాయి. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పగిల్ల స్వప్న రాంరెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ రావుల శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ కాలుష్య కారక కంపెనీలపై చర్యలు తీసుకోవాలని ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పగిల్ల సుధాకర్‌రెడ్డి, ప్రసాదం విష్ణు, చొప్పరి పాండు, గునమోని నర్సింహ, కృష్ణ, గుర్రం రఘుమారెడ్డి, బాలం మల్లేష్, పచ్చిమట్ల పరమేష్ పాల్గొన్నారు.
స్పందించిన పరిశ్రమల యాజమాన్యం
దోతిగూడెం ప్రజల ఆందోళనతో చౌటుప్పల్ రూరల్ సీఐ మహేష్ ప్రత్యేక చొరవ తీసుకుని కంపెనీ యాజమాన్యాలతో చర్చించారు. ఈ మేరకు కంపెనీల యాజమాన్యాలు సమావేశమై ఒక తీర్మానం చేశాయి. ప్రతిరోజూ ఏడుగురు సభ్యులు గల కమిటీ సాయంత్రం, రాత్రివేళల్లో పర్యవేక్షించి ఏ కంపెనీల నుంచి వ్యర్థ రసాయనాలు గాలిలోకి వదులుతున్నారో తెలుసుకొని, ఆయా కంపెనీలపై చర్యలకు సమష్టిగా కృషి చేద్దామని అంగీకారానికి వచ్చారు. దీంతో ఆందోళన కార్యక్రమాలను గ్రామస్థులు తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు.