సంగారెడ్డి పోలీస్‌ స్టేషన్‌లో చైల్డ్‌ ఫ్రెండ్లీ కార్నర్‌

ABN , First Publish Date - 2023-10-08T04:53:11+05:30 IST

తెలంగాణ పోలీసు వ్యవస్థ దేశానికే ఆదర్శమని డీజీపీ అంజనీకుమార్‌ అన్నారు. సంగారెడ్డి పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ‘చైల్డ్‌ ఫ్రెండ్లీ కార్నర్‌’ను, సంగారెడ్డిలో కొత్తగా నిర్మించిన భరోసా ...

సంగారెడ్డి పోలీస్‌ స్టేషన్‌లో చైల్డ్‌ ఫ్రెండ్లీ కార్నర్‌

రాష్ట్రంలోని మొట్టమొదటిది.. ప్రారంభించిన డీజీపీ

సంగారెడ్డి క్రైం, అక్టోబరు 7: తెలంగాణ పోలీసు వ్యవస్థ దేశానికే ఆదర్శమని డీజీపీ అంజనీకుమార్‌ అన్నారు. సంగారెడ్డి పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ‘చైల్డ్‌ ఫ్రెండ్లీ కార్నర్‌’ను, సంగారెడ్డిలో కొత్తగా నిర్మించిన భరోసా కేంద్రాన్ని శనివారం ఆయన, అడిషనల్‌ డీజీపీ శిఖాగోయల్‌ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అంజనీకుమార్‌ మాట్లాడుతూ.. చైల్ట్‌ ఫ్రెండ్లీ కార్నర్‌ను రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా సంగారెడ్డి పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. త్వరలోనే అన్ని పోలీస్‌ స్టేషన్లలో ఏర్పాటు చేస్తామన్నారు. పిల్లలకు పోలీస్‌ స్టేషన్‌కు వచ్చామనే భావన కలగకుండా, పోలీస్‌ స్టేషన్‌ అంటే భయం పోయేలా చైల్డ్‌ కార్నర్‌లో అహ్లాదకరమైన వాతావరణం ఉంటుందని చెప్పారు. పోక్సో, అత్యాచార కేసుల్లో బాధితులకు కౌన్సెలింగ్‌తో పాటు, మెడికో లీగల్‌ సేవలు అందించడం, బాధిత మహిళలకు ఆశ్రయం కల్పించడం వంటి సేవలను భరోసా కేంద్రాల ద్వారా అందిస్తున్నామని చెప్పారు. తెలంగాణలో మహిళల రక్షణకు షీ టీమ్స్‌ నిరంతరం పనిచేస్తున్నాయని, మహిళలు ఈవ్‌ టీజింగ్‌ ఎదుర్కొన్నా, ఆపద సమయాల్లోనైనా 8712656772కు ఫోన్‌ చేయాలని లేదా వాట్సాప్‌ ద్వారా మెసేజ్‌ పంపాలని శిఖా గోయల్‌ సూచించారు.

Updated Date - 2023-10-08T04:53:11+05:30 IST