CM KCR: సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయం

ABN , First Publish Date - 2023-06-24T15:45:20+05:30 IST

సీఎం కేసీఆర్‌ (CM KCR) కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఈ నెల 30 నుంచి పోడు భూముల పట్టాల పంపిణీ చేస్తామని ప్రకటించారు. అసిఫాబాద్ జిల్లా (Asifabad District)లో కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. పోడు భూములకు పట్టాలు పంపిణీ చేయాలంటూ మంత్రులు, ఎమ్మెల్యేలకు కేసీఆర్‌ ఆదేశాలిచ్చారు.

CM KCR: సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయం

హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ (CM KCR) కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఈ నెల 30 నుంచి పోడు భూముల పట్టాల పంపిణీ చేస్తామని ప్రకటించారు. అసిఫాబాద్ జిల్లా (Asifabad District)లో కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. పోడు భూములకు పట్టాలు పంపిణీ చేయాలంటూ మంత్రులు, ఎమ్మెల్యేలకు కేసీఆర్‌ ఆదేశాలిచ్చారు. ఎట్టకేలకు ఎన్నో సంవత్సరాలుగా పోడు భూముల్లో సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. సంవత్సరాలుగా పోడు భూముల కోసం ఎదురుచూస్తున్న రైతుల కల నెరవేరనుంది. ఈ మేరకు ఎంపికైన లబ్ధిదారుల్లో హర్షం వ్యక్తం అవుతోంది. అయితే గిరిజనులకే మొదటి ప్రాధాన్యత కింద పోడు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఇందులో భాగంగా వచ్చిన దరఖాస్తుల్లోంచి గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇంతకాలం తమ భూములకు పట్టాలు ఇస్తామని భావించి పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనేతరులు అయోమయంలో పడ్డారు. తాతల, తండ్రుల నుంచి భూమిని సాగు చేసుకుంటున్న తమకు హక్కు పత్రాలు వచ్చే అవకాశాలు సన్నగిల్లుతున్నాయని గిరిజనేతరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూమినే నమ్ముకుని గిరిజనులతో మమేకమై జీవిస్తున్న తమకు అన్యాయం చేయవద్దని తాము సాగు చేసుకుంటున్న భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని గిరిజనేతరులు కోరుతున్నారు. ఆయా జిల్లాలోని పరిధిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తూనే అభయారణ్య భూములు, రెవెన్యూ భూములను మినహాయిస్తూ ఇతర భూములను రైతులకు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-06-24T16:07:41+05:30 IST