Share News

Cm Kcr Meeting: రేపు హైదరాబాద్‌లో కేసీఆర్ సభ రద్దు.. కారణమిదే!

ABN , First Publish Date - 2023-11-24T10:28:09+05:30 IST

వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో సభను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పార్టీ హైకమాండ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Cm Kcr Meeting: రేపు హైదరాబాద్‌లో కేసీఆర్ సభ రద్దు.. కారణమిదే!

హైదరాబాద్: రేపు (25-11-2023) హైదరాబాద్‌లో జరగాల్సిన సీఎం కేసీఆర్ (Cm Kcr Meeting Cancel) సభ రద్దైనట్లు సమాచారం. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం పరేడ్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన సభను బీఆర్ఎస్ అధిష్టానం (BRS) క్యాన్సిల్ చేసినట్లు తెలుస్తోంది. రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో సభను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పార్టీ హైకమాండ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగుతోంది. ముఖ్య నేతలంతా ఆయా నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. విమర్శలు.. ప్రతి విమర్శలతో నేతలు ప్రచారాన్ని హీటెక్కిస్తున్నారు. మరో నాలుగు రోజులే ప్రచారం మిగిలి ఉండడంతో ఉదయం నుంచే నేతలంతా ప్రచారంలో మునిగి తేలుతున్నారు.

Updated Date - 2023-11-24T11:21:35+05:30 IST