పట్టణ ప్రాంత వాసులు ఎక్కువగా చర్మవ్యాధులకు గురవుతున్నారు: డాక్టర్ మంజుల అనగాని
ABN , First Publish Date - 2023-10-09T23:27:07+05:30 IST
పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారు ఎక్కువగా చర్మ వ్యాధులకు గురవుతున్నారని పద్మశ్రీ గ్రహీత డాక్టర్ మంజుల అనగాని అన్నారు. ఆదివారం ఆమె ఖాజాగూడలో నూతనంగా ఏర్పాటు చేసిన డెర్మిక్ ప్రపంచ స్థాయి స్కిన్, హెయిర్ క్లినిక్‌ను ప్రముఖ యాంకర్ ఓంకార్‌తో కలిసి ప్రారంభించారు.
పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారు ఎక్కువగా చర్మ వ్యాధులకు గురవుతున్నారని పద్మశ్రీ గ్రహీత డాక్టర్ మంజుల అనగాని అన్నారు. ఆదివారం ఆమె ఖాజాగూడలో నూతనంగా ఏర్పాటు చేసిన డెర్మిక్ ప్రపంచ స్థాయి స్కిన్, హెయిర్ క్లినిక్‌ను ప్రముఖ యాంకర్ ఓంకార్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చర్మ వ్యాధుల్లో ప్రస్తుతం అధునాతన శస్త్ర చికిత్సలు నగరంలో కూడా అందుబాటులోకి వచ్చాయని.. ఒకప్పుడు ముంబై, చెన్నై, బెంగళూరు, ఇతర దేశాలకు వెళ్ళాల్సి వచ్చేదని అన్నారు.
అత్యాధునిక పరికరాలతో, ప్రపంచ స్థాయి వైద్యం అందించేందుకు డెర్మిక్ సంస్థ మూడో బ్రాంచీని ఖాజా గూడలో ఏర్పాటు చేయడం అభినందనీయమని ఈ సందర్భంగా ఆమె నిర్వాహకులను అభినందించారు. నేటి యువత, మహిళలు స్కిన్‌కేర్‌పై ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నారని అలాంటి వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. నగర వాసుల అవసరాలు తీర్చేందుకు నగరంలో మరిన్ని శాఖలు తెరవనున్నామని నిర్వాహకులు డాక్టర్ దీపికా నర్రా, దివ్యశ్రీ, లక్ష్మి దివ్యలు తెలిపారు.