Geoffrey the Giraffe: హైదరాబాద్‌లో జెఫ్రీ ద జిరాఫీ.. మీరు చూశారా?

ABN , First Publish Date - 2023-03-09T21:29:43+05:30 IST

నగరంలో ఇప్పుడు ‘జెఫ్రీ ద జిరాఫీ’(Geoffrey the Giraffe) సంచరిస్తోంది

Geoffrey the Giraffe: హైదరాబాద్‌లో జెఫ్రీ ద జిరాఫీ.. మీరు చూశారా?

హైదరాబాద్: నగరంలో ఇప్పుడు ‘జెఫ్రీ ద జిరాఫీ’(Geoffrey the Giraffe) సంచరిస్తోంది. అందరితోనూ ఎంతో కలివిడిగా ఇది కలిసిపోతోంది. తొలుత ఇది ఎయిర్‌పోర్టులో కనిపించింది. ఆ తర్వాత హుస్సేన్ సాగర్ తీరంలో కనిపించి అలరించింది. అక్కడి అందాలను ఆస్వాదించింది. అక్కడి నుంచి చారిత్రక కట్టడమైన చార్మినార్‌ను సందర్శించింది. ఇప్పుడీ జిరాఫీ హైటెక్ సిటీ, రామోజీ ఫిలిం సిటీని సందర్శించే అవకాశం ఉందని తెలుస్తోంది.

నగరంలో కనిపిస్తున్న ఈ జిరాఫీ గోలేంటి? అని ఆశ్చర్యపోతుంటే మాత్రం వెంటనే ఈ నెల 11న మాదాపూర్‌లోని శరత్ సిటీ క్యాపిటల్ మాల్ వద్ద ఉన్న ‘టోయ్స్‌రస్’(Toys“R”Us) స్టోర్‌కు వెళ్లాల్సిందే. అక్కడ జెఫ్రీ ద జిరాఫీని కలుసుకోవడం మాత్రమే కాదు.. అదృష్టవంతులూ కావొచ్చు.

Updated Date - 2023-03-09T21:32:12+05:30 IST