Dimple Hayathi Case : హైకోర్టును ఆశ్రయించిన డింపుల్ హయాతి
ABN , First Publish Date - 2023-06-08T10:52:24+05:30 IST
సినీ నటి డింపుల్ హయాతి నేడు హైకోర్టును ఆశ్రయించింది. ఐపీఎస్ రాహుల్ హెగ్డే కేసులో ఆమె కోర్టు మెట్లెక్కింది. ట్రాఫిక్ డీసీపీ అధికారిక వాహనాన్ని తన బీఎండబ్ల్యూ వాహనంతో ఢీకొట్టిందంటూ ఇటీవల డింపుల్ హయాతి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. జూబ్లీహిల్స్ పోలీసులు నటి పై దాడి, క్రిమినల్ ఫోర్స్ ఆరోపణలపై కేసు నమోదు చేశారు. పబ్లిక్ సర్వెంట్‌ను విధులు చేయనివ్వకుండా అడ్డుపడటం, అక్రమ నిర్బంధం, బహిరంగ ప్రదేశంలో ర్యాష్ డ్రైవింగ్ కేసులు పెట్టారు.
హైదరాబాద్ : సినీ నటి డింపుల్ హయాతి నేడు హైకోర్టును ఆశ్రయించింది. ఐపీఎస్ రాహుల్ హెగ్డే కేసులో ఆమె కోర్టు మెట్లెక్కింది. ట్రాఫిక్ డీసీపీ అధికారిక వాహనాన్ని తన బీఎండబ్ల్యూ వాహనంతో ఢీకొట్టిందంటూ ఇటీవల డింపుల్ హయాతి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. జూబ్లీహిల్స్ పోలీసులు నటి పై దాడి, క్రిమినల్ ఫోర్స్ ఆరోపణలపై కేసు నమోదు చేశారు. పబ్లిక్ సర్వెంట్‌ను విధులు చేయనివ్వకుండా అడ్డుపడటం, అక్రమ నిర్బంధం, బహిరంగ ప్రదేశంలో ర్యాష్ డ్రైవింగ్ కేసులు పెట్టారు.
ఆ ఘటనలో తనపై ఉన్న కేసును కొట్టివేయాలని. .తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ కేసులు నమోదు చేశారని డింపుల్ హయాతి నేడు హైకోర్టును ఆశ్రయించారు. ఫార్చ్యూనర్‌తో పోలిస్తే సైజులో చాలా చిన్నది, సున్నితంగా ఉండే బీఎండబ్ల్యూ కారు ఢీకొనడం వల్ల.. దాని కంటే బలమైన, బరువైన పోలీసు వాహనం డ్యామేజ్ అయ్యే అవకాశం లేదని ఆమె తన పిటిషన్ లో పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్‌కి పోలీసులు విక్టర్ డేవిడ్, డింపుల్‌ని పిలవడంలో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ పాటించడం లేదని తన పిటిషన్‌లో తెలిపారు.