Jithender Reddy: బండి సంజయ్‌ని మార్చాక మా నుంచి ప్రజలు కాంగ్రెస్ వైపు మళ్లారు
ABN , First Publish Date - 2023-12-04T12:14:35+05:30 IST
ప్రజలు మార్పు కోరుకున్నారని.. బీఆర్ఎస్ మాకొద్దు అని డిసైడ్ చేసుకున్నారని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తెలిపారు. బీజేపీలో మార్పులు జరిగాయని.. బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉంటే తమ పార్టీ అధికారంలోకి వచ్చేదన్నారు. బండి సంజయ్‌ని మార్చాక మా నుంచి ప్రజలు కాంగ్రెస్ వైపు మళ్లారన్నారు.
మహబూబ్‌నగర్: ప్రజలు మార్పు కోరుకున్నారని.. బీఆర్ఎస్ మాకొద్దు అని డిసైడ్ చేసుకున్నారని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తెలిపారు. బీజేపీలో మార్పులు జరిగాయని.. బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉంటే తమ పార్టీ అధికారంలోకి వచ్చేదన్నారు. బండి సంజయ్‌ని మార్చాక మా నుంచి ప్రజలు కాంగ్రెస్ వైపు మళ్లారన్నారు. ఇక్కడ కాంగ్రెస్ పరిపాలన చేయలేదు కాబట్టే.. కర్ణాటకలో ఇపుడు కాంగ్రెస్ ప్రభుత్వం చతికిలపడిందన్నారు. ఇక్కడ వారు ఇచ్చిన హామీలు అమలు చేయలేరని.. వారికి కేంద్ర ప్రభుత్వ అండ లేదని జితేందర్ రెడ్డి పేర్కొన్నారు. మన రాష్ట్రం ఐదు సంవత్సరాలు వెనక్కి పోయిందన్నారు. అయినా రేవంత్ రెడ్డి.. యెన్నం శ్రీనివాసరెడ్డి మంచి పాలన అందించాలని కోరుకుంటున్నాన్నారు. మరో 30 ఏళ్లు దేశంలో బీజేపీ పాలనే ఉంటుందన్నారు. దీనికి నిదర్శనం.. మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయమేనన్నారు. 2024లో బంపర్ మెజారిటీతో తాము గెలుస్తామని జితేందర్ రెడ్డి పేర్కొన్నారు.