Hyderabad: హైదరాబాద్‌లో అగ్నిప్రమాదం.. భయాందోళనలో ప్రజలు

ABN , First Publish Date - 2023-01-22T16:41:18+05:30 IST

సికింద్రాబాద్‌ (Secunderabad) డెక్కన్‌ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం ఘటనను మరువక ముందే.. హకీంపేట (Hakimpet)లో అగ్నిప్రమాదం జరిగింది. సాలార్జంగ్ బ్రిడ్జి ఏరియాలో వెల్డింగ్ వర్క్‌షాప్‌లో ...

Hyderabad: హైదరాబాద్‌లో అగ్నిప్రమాదం.. భయాందోళనలో ప్రజలు

హైదరాబాద్: సికింద్రాబాద్‌ (Secunderabad) డెక్కన్‌ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం ఘటనను మరువక ముందే.. హకీంపేట (Hakimpet)లో అగ్నిప్రమాదం జరిగింది. సాలార్జంగ్ బ్రిడ్జి ఏరియాలో వెల్డింగ్ వర్క్‌షాప్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఎల్పీజీ సిలిండర్ల నుంచి చిన్న సిలిండర్లలో గ్యాస్ నింపుతుండగా ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చింది. నగరంలో వరుస అగ్నిప్రమాదాలతో ప్రజలు వణికిపోతున్నారు. మరోవైపు డెక్కన్‌ కాంప్లెక్స్‌ (Deccan Complex) అగ్నిప్రమాదంలో భవనంలోపల చిక్కుకుపోయిన ముగ్గురు యువకులు బూడిదైనట్లు పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు నిర్ధారించారు. రెండో అంతస్తులో ఇద్దరు, మొదటి అంతస్తులో ఒకరు చనిపోయినట్లు ఆనవాళ్లలన్న విషయాన్ని శుక్రవారం డ్రోన్ల ద్వారా గుర్తించిన విషయం తెలిసిందే. శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో.. మొదటి అంతస్తు లిఫ్టు వద్ద ఓ యువకుడి పుర్రె, వెన్నెముక, ఎముకలు, బూడిదను సేకరించారు. అనంతరం ఆ అస్థికలను గాంధీ మార్చురీకి తరలించారు. రెండో అంతస్తుకు వెళ్లేందుకు వీలుపడడం లేదని, భవనం, గోడలు ఇంకా వేడిగా ఉన్నాయని అగ్నిమాపక శాఖ సిబ్బంది చెబుతున్నారు. ఆ వేడికి డ్రోన్లను పంపండం కూడా సాధ్యపడదని పేర్కొంటున్నారు. ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న అస్థికలు ఒక్కరివేనా? లేక ఇద్దరివా? అనే సందేహాలను క్లూస్‌టీం అధికారులు వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-01-22T16:41:20+05:30 IST