Pilot Rohith Reddy : ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి నిర్వహిస్తున్న అతి రుద్ర మహాయాగంలో అపశృతి..
ABN , First Publish Date - 2023-07-13T12:54:28+05:30 IST
వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నిర్వహిస్తున్న అతి రుద్ర మహాయాగంలో అపశృతి చోటు చేసుకుంది. చివరి రోజు పూర్ణ ఆహుతిలో మంటలు ఎగిసి పడ్డాయి. టెంట్లు, హోమ గుండాలు కాలి బూడిద అయ్యాయి.
వికారాబాద్ : వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నిర్వహిస్తున్న అతి రుద్ర మహాయాగంలో అపశృతి చోటు చేసుకుంది. చివరి రోజు పూర్ణ ఆహుతిలో మంటలు ఎగిసి పడ్డాయి. టెంట్లు, హోమ గుండాలు కాలి బూడిద అయ్యాయి. అక్కడున్న వారు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో వారు హుటాహుటిన వచ్చి మంటలను అదుపు చేశారు. ఎవరికి ఎలాంటి ప్రమాదమూ జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
మూడు రోజులుగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి దంపతులు అతిరుద్ర మహాయాగం నిర్వహిస్తున్నారు. నేటితో యాగం ముగిసింది. పూర్ణాహుతి కార్యక్రమంలో మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో మండపంలోని వారంతా ఆందోళనకు గురై అక్కడి నుంచి బయటకు పరుగులు తీశారు. క్షణాల్లోనే ఆ మంటలు కాస్త టెంట్‌కు వ్యాపించాయి. క్షణాల్లో మండపం మొత్తం అగ్ని కీలల్లో చిక్కుకుపోయింది. ఆ ప్రాంతమంతా పొగతో నిండిపోయింది. ఈ ఘటనపై పైలట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ.. తనకు, తన కుటుంబానికి ఎలాంటి హానీ జరగలేదని.. ఎవరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అయితే యాగం ముగిసే రోజు ఇలా జరగడం బాధాకరమన్నారు.