Home » Vikarabad
లగచర్లలో రైతులు దాడులు చేశారన్న నెపంతో పోలీసులు అక్కడి మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ బీఆర్ఎస్ నేతలు శనివారం ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.
లగచర్ల ఫార్మావిలేజ్ ఘటనలో పోలీసులు శనివారం మరో నలుగురిని అరెస్టు చేశారు. పరిగి ఠాణా నుంచి వారిని తరలించి.. కొడంగల్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు.
లగచర్లలో అధికారులపై దాడికి రైతులు, ప్రజలను ఉసిగొల్పడంలో కీలకప్రాత పోషించిన సురేశ్ రాజ్ ఆచూకీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
‘11నెలల నుంచీ ఈ ప్రభుత్వం పని వదంతులు, ఇచ్చికాల మాటలు. చెవులు కొరకడమే. నేను డ్రగ్స్ తీసుకోలేదు, ఫోన్లు ట్యాపింగ్ చేయలేదు, అవినీతి అంతకన్నాచేయలేదు. గతంలో మోదీని ఉద్దేశించి.. మోడీయా.. బోడీయా ఏం పీక్కుంటారో పీక్కో అన్నాను.
లగచర్ల ఘటనలో ప్రభుత్వ ఉద్యోగులపై జరిగిన దాడిని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా ఖండించారు. ప్రజలకు సేవ చేసే ఉద్యోగులపై భౌతిక దాడులకు దిగడం దుర్మార్గమని పేర్కొన్నాయి.
లగచర్ల ఫార్మావిలేజ్‌లో అధికారులపై దాడి ఘటనను పోలీసు శాఖ సీరియ్‌సగా తీసుకుంది. ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది. దీంతో.. శాంతిభద్రతల అదనపు డీజీపీ మహేశ్.ఎం.భగవత్ రంగంలోకి దిగారు.
‘‘వికారాబాద్ జిల్లా కలెక్టర్‌పై దాడి చేసినవారు ఎంతటి వారైనా అరెస్టు కాక తప్పదు. దాడిని ప్రోత్సహించిన బీఆర్ఎస్ నాయకులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.
ఫార్మా పరిశ్రమ ఏర్పాటుపై లగచర్లలో ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడానికి వెళ్లిన కలెక్టర్, ఇతర అధికారులపై కుట్రపూరితంగా దాడులు చేశారని మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహా అన్నారు. ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.
విధి నిర్వహణలో ఉన్న వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్, ఇతర అధికారుల మీద జరిగిన దాడికి నిరసనగా గురువారం రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు ఉద్యోగుల జేఏసీ పిలుపునిచ్చింది.
లగచర్ల ఫార్మా విలేజ్ దాడి కేసు కీలక మలుపు తిరిగింది. ఈ దాడితో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ప్రమేయముందని పోలీసులు తేల్చారు. అంతేకాదు.. ఘటనకు ముందు.. ఆ తర్వాత కేటీఆర్‌తో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ఫోన్లో మాట్లాడిన ఆడియో రికార్డును, ఇతర సాంకేతిక ఆధారాలను పోలీసులు సేకరించారు.