GHMC Commissioner : జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా రొనాల్డ్ రాస్
ABN , First Publish Date - 2023-07-05T04:16:11+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ.. వెయిటింగ్‌లో ఉన్న మరో ఐఏఎస్ అధికారికి పోస్టింగ్ ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్
ఎన్నికల అధికారులుగా లోకేశ్ కుమార్, సర్ఫరాజ్ అహ్మద్
ముగ్గురు ఐఏఎస్‌లను బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
వెయిటింగ్‌లో ఉన్న మరొకరికి పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు
హైదరాబాద్, జూలై 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ.. వెయిటింగ్‌లో ఉన్న మరో ఐఏఎస్ అధికారికి పోస్టింగ్ ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ) కమిషనర్‌గా ఉన్న డీఎస్ లోకేశ్ కుమార్‌ను తెలంగాణ రాష్ట్ర అదనపు ఎన్నికల ప్రధానాధికారిగా సర్కారు నియమించింది. ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్‌ను అక్కడి నుంచి బదిలీ చేసి, తెలంగాణ రాష్ట్ర సంయుక్త ఎన్నికల ప్రధానాధికారిగా నియమించింది. వీరిద్దరినీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో) కార్యాలయంలో నియమించాలంటూ ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘం.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. ఏ ఏ పోస్టుల్లో నియమించాలన్నది కూడా వివరించింది. దాంతో రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరిని బదిలీ చేసింది. ఆర్థిక శాఖ కార్యదర్శి రొనాల్డ్ రాస్‌ను బదిలీ చేసి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా నియమించింది. గతంలో నిర్మల్ కలెక్టర్‌గా పని చేసి, వెయిటింగ్‌లో ఉన్న ముషారఫ్ అలీ ఫారూఖీని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్‌గా నియమించింది.