ఖాళీ బిందెకు బంగారు పూత

ABN , First Publish Date - 2023-07-13T05:38:28+05:30 IST

గత పదేళ్లలో సీఎం కేసీఆర్‌ అక్షరాల రూ. 5లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని దివాళా తీయించారని వైఎస్సార్టీపీ అధినేత్రి

ఖాళీ బిందెకు బంగారు పూత

ఇదే కేసీఆర్‌ చెప్పే బంగారు తెలంగాణ: షర్మిల

హైదరాబాద్‌, జూలై 12 (ఆంధ్రజ్యోతి): గత పదేళ్లలో సీఎం కేసీఆర్‌ అక్షరాల రూ. 5లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని దివాళా తీయించారని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిల బుధవారం ట్విటర్‌ వేదికగా మండిపడ్డారు. కేసీఆర్‌ చేసిన అప్పులు ఘనమైనా.. రాష్ట్రంలో అభివృద్ధి మాత్రం శూన్యమని అన్నారు. ఖాళీ బిందెకు బంగారు పూతపూసి ఇదే బంగారు తెలంగాణ అని కేసీఆర్‌ అంటున్నారని ఎద్దేవా చేశారు. అభివృద్ధికి అప్పులు తెస్తే తప్పేంటని కేసీఆర్‌ అంటున్నారని, కాని తెచ్చిన డబ్బంతా ఎక్కడ ఖర్చు పెడ్తున్నారో, ఎక్కడ అభివృద్ధి చేస్తున్నారో ఆయనే చెప్పాలని ప్రశ్నించారు. రూ. లక్షల కోట్లు అప్పులు తెచ్చి ప్రజలకు అర చేతిలో త్రీడీ సినిమా చూపించి, కమీషన్ల కింద తన ఖజానాకే నిధులన్నింటిని కేసీఆర్‌ మళ్లీంచుకున్నారని ఆరోపించారు.

Updated Date - 2023-07-13T05:38:28+05:30 IST