రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ABN , First Publish Date - 2023-06-03T22:17:55+05:30 IST
ఆసిఫాబాద్ రూరల్, జూన్ 3: రైతు సంక్షేమమే ప్రభు త్వ ధ్యేయమని ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతవరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా శనివారం మండలంలోని జక్కాపూర్, బూర్గుడ, రహపల్లి, చిర్రకుంట, బాబాపూర్, వావుదాం రైతువేదికల్లో రైతు దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు.

ఆసిఫాబాద్ రూరల్, జూన్ 3: రైతు సంక్షేమమే ప్రభు త్వ ధ్యేయమని ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతవరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా శనివారం మండలంలోని జక్కాపూర్, బూర్గుడ, రహపల్లి, చిర్రకుంట, బాబాపూర్, వావుదాం రైతువేదికల్లో రైతు దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ రాష్ట్రంలో సమగ్ర వ్యవవసాయాభివృద్ధికి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ హేమంత్ సహదేవరావు, అదనపుకలెక్టర్ రాజేశం, చాహత్ బాజ్‌పాయి, జడ్పీటీసీ అరిగెలనాగేశ్వర్‌రావు, ఎంపీపీ మల్లి కార్జున్, మార్కెట్‌కమిటీ చైర్మన్ గాదవేణిమల్లేష్, పీఏసీఎస్ చైర్మన్ అలీబీన్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.