TSRTC Merger Bill : కేసీఆర్ సర్కార్ వివరణపై గవర్నర్ సంతృప్తి.. గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లే..!
ABN , First Publish Date - 2023-08-05T15:12:02+05:30 IST
తెలంగాణ ప్రభుత్వంలో టీఎస్ఆర్టీసీ (TSRTC) విలీనంపై గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది!. ఆర్టీసీ బిల్లుపై కేసీఆర్ సర్కార్ ఇచ్చిన వివరణ పట్ల గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టేందుకు గవర్నర్ అనుమతి తెలపనున్నారు.!
తెలంగాణ ప్రభుత్వంలో టీఎస్ఆర్టీసీ (TSRTC) విలీనంపై గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది!. ఆర్టీసీ బిల్లుపై కేసీఆర్ సర్కార్ ఇచ్చిన వివరణ పట్ల గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టేందుకు గవర్నర్ అనుమతి తెలపనున్నారు.! శనివారం సాయంత్రం కల్లా పుదుచ్చేరి నుంచి హైదరాబాద్‌కు గవర్నర్ రానున్నారు. ఇవాళ రాత్రిలోగా ఆర్టీసీ బిల్లుకు ఆమోదం తెలిపనున్నట్లు తెలియవచ్చింది. ఆర్టీసీ సంస్థ , ఉద్యోగుల ప్రయోజనాల దృష్ట్యా బిల్లుపై న్యాయ నిపుణులతో చర్చించిన అనంతరం తమిళిసై పచ్చజెండా ఊపారని తెలిసింది. ఈ విషయం బయటికి రావడంతో ఆర్టీసీ కార్మికులు ఆనందంలో మునిగితేలుతున్నారు.
ఎప్పుడేం జరిగింది..?
కాగా.. ఆర్టీసీ విలీనంపై శనివారం నాడు పెద్ద రాద్ధాంతమే జరిగింది. ఆర్టీసీ విలీనానికి కేసీఆర్ క్యాబినెట్ ఆమోదం తెలపడం, గవర్నర్ తమిళిసై ఆమోదం కోసం బిల్లు పంపడం.. ఆర్టీసీ కార్మికులు రాజ్‌భవన్‌ను ముట్టడించడం.. విధివిధానాలపై ప్రభుత్వానికి 5 ప్రశ్నలు సంధించడం, ప్రభుత్వం నుంచి రిప్లయ్ రావడం.. ఈ మధ్యలోనే ఆర్టీసీ సంఘాల నేతలతో వీడియో కాన్ఫరెన్స్‌లో తమిళిసై మాట్లాడటం ఇవనన్నీ చకచకా జరిగిపోయాయి.
గవర్నర్ ఏం అడిగారు..?
1958 నుంచి ఆర్టీసీలో కేంద్ర గ్రాంట్‌లు, వాటాలు, లోన్లు, ఇతర సహాయం గురించి బిల్లులో ఎలాంటి వివరాలు లేవేం..?
రాష్ట్ర విభజన చట్టం షెడ్యూల్ IX ప్రకారం ఆర్టీసీ స్థితి ని మార్చడంపై సమగ్ర వివరాలు బిల్లులో ఎందుకు లేవు..?
ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పరిగణిస్తామని చెబుతున్న ప్రభుత్వం.. వారి సమస్యలకు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ చట్టం, కార్మిక చట్టాలు వర్తిస్తాయా..? వారి ప్రయోజనాలు ఎలా కాపాడబడతాయి..?
విలీనం డ్రాఫ్ట్ బిల్లులో ఆర్టీసీ ఉద్యోగులు అందరికీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పెన్షన్ ఇస్తారా..? వారికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని ప్రయోజనాలు ఇవ్వడానికి సంబంధించి స్పష్టమైన వివరాలు ఇవ్వండి..?
ప్రభుత్వ ఉద్యోగులలో కండక్టర్, కంట్రోలర్ లాంటి తదితర పోస్టులు లేనందున వారి ప్రమోషన్లు, వారి క్యాడర్ నార్మలైజేషన్ లాంటి విషయాల్లో ఆర్టీసీ ఉద్యోగులకు న్యాయం, ఇతర ప్రయోజనాలు అందే విధంగా స్పష్టమైన వివరాలు ఇవ్వాలని ఆర్టీసీ కార్మికుల భద్రత, భవిష్యత్ ప్రయోజనాలపై స్పష్టమైన హామీలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని గవర్నర్ కోరారు.
ప్రభుత్వం ఏం చెప్పింది..?
ఏపీ తరహాలోనే టీఎస్ఆర్టీసీ విలీన ప్రక్రియపై ప్రభుత్వం విధానాన్నే అమలు చేస్తాం.
ఉద్యోగులను మాత్రమే ప్రభుత్వంలోకి తీసుకుంటాం.
టీఎస్ఆర్టీసీ సంస్థ యథాతథంగా కొనసాగుతుంది.
టీఎస్ఆర్టీసీ యథాతథంగా కొనసాగుతున్నందున విభజన చట్టానికి ఇబ్బంది లేదు.
ప్రభుత్వంలో విలీనం జరిగిన తర్వాత కూడా కార్మికులతో చర్చించే నిర్ణయాలు తీసుకుంటాం.
కేంద్రం వాటాలు, లోన్‌లపై నిబంధనలు పాటిస్తాం
కార్మిక చట్టాలను గైడ్‌లైన్స్ ప్రకారం అమలు చేస్తాం
ఆర్టీసీని మించి జీతభత్యాలు ఇస్తాం
అసెంబ్లీలో బిల్లు పాసైన తర్వాత విధివిధానాలను ఖరారు చేస్తామని గవర్నర్‌కు నిశితంగా లేఖలో వివరించింది కేసీఆర్ సర్కార్.