Group-1 Mains : జూన్ 5 నుంచి గ్రూప్-1 మెయిన్స్
ABN , First Publish Date - 2023-02-01T03:23:58+05:30 IST
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు ముహూర్తం ఖరారైంది. 503 పోస్టుల భర్తీకి సంబంధించి.. గత ఏడాది అక్టోబరులో నిర్వహించిన ప్రిలిమ్స్‌లో పోస్టుకు 1:50 చొప్పున మెయిన్స్‌కు ఎంపిక చేసిన విషయం తెలిసిందే. దివ్యాంగుల కేటగిరీలో మాత్రం 1:50 నిష్పత్తికి తగినట్లు అభ్యర్థులు లేరని.
హైదరాబాద్, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు ముహూర్తం ఖరారైంది. 503 పోస్టుల భర్తీకి సంబంధించి.. గత ఏడాది అక్టోబరులో నిర్వహించిన ప్రిలిమ్స్‌లో పోస్టుకు 1:50 చొప్పున మెయిన్స్‌కు ఎంపిక చేసిన విషయం తెలిసిందే. దివ్యాంగుల కేటగిరీలో మాత్రం 1:50 నిష్పత్తికి తగినట్లు అభ్యర్థులు లేరని.. దాంతో మొత్తం 25,050 మందిని మెయిన్స్‌కు ఎంపిక చేసినట్లు, వీరికి జూన్‌లో మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తామని ప్రిలిమ్స్ ఫలితాల సమయంలోనే టీఎ్‌సపీఎస్సీ వెల్లడించింది. జూన్ 5 నుంచి 12వ తేదీ వరకు ఈ పరీక్షలను నిర్వహిస్తామని పేర్కొంటూ మంగళవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. 11వ తేదీ(ఆదివారం) మినహా.. మిగతా ఏడు రోజుల్లో.. జనరల్ ఇంగ్లి్‌ష(అర్హత పరీక్ష), ఆరు పేపర్లకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ పరీక్షలను నిర్వహిస్తామని, పరీక్ష కేంద్రాలు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవల్‌పమెంట్ అథారిటీ(హెచ్‌ఎండీఏ) పరిధిలోనే ఉంటాయని వెల్లడించింది. ఇంగ్లిష్ పరీక్ష కేవలం అర్హత కోసమేనని, తుది మార్కుల్లో పరిగణనలోకి తీసుకోబోమని పేర్కొంది. అభ్యర్థులు అన్ని పరీక్షలకు హాజరుకావాలని, ఒక్క పరీక్షకు గైర్హాజరైనా.. మూల్యాంకనంలో పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేసింది.
పరీక్షల షెడ్యూల్ ఇదీ..
5న జనరల్ ఇంగ్లిష్
6న పేపర్-1(జనరల్ ఎస్సే)
7న పేపర్-2(చరిత్ర, సంస్కృతి, భూగోళశాస్త్రం)
8న పేపర్-3(భారత సమాజం, రాజ్యాంగం,
పరిపాలన)
9న పేపర్-4(భారత/తెలంగాణ
ఆర్థిక వ్యవస్థ, ఆర్థికశాస్త్రం-అభివృద్ధి)
10న పేపర్-5(సైన్స్ అండ్ టెక్నాలజీ,
డేటా ఇంటర్‌ప్రిటేషన్)
12న పేపర్-6(తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం)