Guvvala Balraju : అపోలో నుంచి గువ్వల డిశ్చార్జ్.. అర్ధరాత్రి దాడిచేసిందెవరో చెప్పిన ఎమ్మెల్యే
ABN , First Publish Date - 2023-11-12T15:32:23+05:30 IST
తనపై కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ, ఆయన అనుచరులే నిన్న రాత్రి దాడి చేశారని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు(Guvvala Balraju) ఆరోపించారు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన్ని ఇవాళ డిశ్చార్జ్ చేశారు.
హైదరాబాద్: తనపై కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ, ఆయన అనుచరులే నిన్న రాత్రి దాడి చేశారని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు(Guvvala Balraju) ఆరోపించారు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన్ని ఇవాళ డిశ్చార్జ్ చేశారు.
అసలేం జరిగింది..?
అనంతరం గువ్వల మీడియాతో మాట్లాడుతూ.. "అచ్చంపేటలో నాపై కాంగ్రెస్(Congress) పార్టీ నేతలే దాడులు చేశారు. బీఆర్ఎస్ శ్రేణులు సహనం కోల్పోవద్దు. పగలు, ప్రతీకారాలు మన సంస్కృతి కాదు. కాంగ్రెస్ గుండాలే నాపై దాడులు చేశారు. నా అనుచరులను చంపినంత పని చేశారు. గతంలోనూ వంశీకృష్ణ నాపై దాడులు చేయించారు. నేను నమ్మే దైవం నా తల్లిదండ్రుల సాక్షిగా చెబుతున్న ఇప్పుడు కూడా వంశీకృష్ణ అతని అనుచరులు నా మీద దాడి చేశాడు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై కూడా కాంగ్రెస్ నేతలు దాడులకు పాల్పడ్డారు. దాడి జరగవచ్చని 10 రోజుల ముందు నుంచే పోలీసులకు చెబుతూ వచ్చాను. నా మీద పిరికితనంతో దాడి చేశారు. జైళ్లలో క్రిమినల్స్ ని తీసుకువచ్చి దాడులు చేస్తున్నారు. నా అనుచరులకు కూడా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ప్రాణం పోయినా కానీ నా నియోజకవర్గ అభివృద్ధి విషయంలో రాజీ పడేది లేదు. మళ్లీ ప్రచారంలో జోరు పెంచాలి. ప్రాణమున్నంత వరకు కేసీఆర్ నాయకత్వంలో రాజకీయాల్లో పని చేస్తాను. కాంగ్రెస్ నేతల అరాచకాలను అణిచివేయాలి" అని గువ్వల బాలరాజు కామెంట్లు చేశారు.