మత సామరస్యానికి ప్రతీక హజరతఅబ్బాస్‌ దర్గా

ABN , First Publish Date - 2023-02-21T00:51:52+05:30 IST

జిల్లా లో రెండో జానపహాడ్‌గా, హిందూ, ముస్లింల ఐక్యతకు ప్రతీకగా నిలిచే హజరతఅబ్బా్‌స ఉర్సు ఉత్సవాలకు దర్గా ముస్తాబైంది. చింతపల్లి మండ లం పీకే మల్లేపల్లిలో గల ఈ దర్గాలో ఉత్సవాలు మంగళవారం నుంచి ప్రా రంభంకానున్నాయి

 మత సామరస్యానికి ప్రతీక హజరతఅబ్బాస్‌ దర్గా
ముస్తాబైన హజరత అబ్బా్‌సదర్గా

మత సామరస్యానికి ప్రతీక హజరతఅబ్బాస్‌ దర్గా

నేటి నుంచి దర్గా ఉత్సవాలు

చింతపల్లి, ఫిబ్రవరి 20: జిల్లా లో రెండో జానపహాడ్‌గా, హిందూ, ముస్లింల ఐక్యతకు ప్రతీకగా నిలిచే హజరతఅబ్బా్‌స ఉర్సు ఉత్సవాలకు దర్గా ముస్తాబైంది. చింతపల్లి మండ లం పీకే మల్లేపల్లిలో గల ఈ దర్గాలో ఉత్సవాలు మంగళవారం నుంచి ప్రా రంభంకానున్నాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉర్సు ఉత్సవాలకు జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తుంటారు. మంగళవారం రాత్రి 11 గంటలకు దర్గా ముత్తవెల్లి చాంద్‌పాష గృహం నుంచి గంధం (సందల్‌) ఒంటెపై భక్తజన సందోహంతో ఊరేగింపుగా వచ్చి దేవుడికి చెల్లించనున్నారు. ఈ ఉత్సవాలను తిలకించేందుకు ఉమ్మడి నల్లగొండ జిల్లా తో పాటు మహబూబ్‌నగర్‌, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్‌, గుం టూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో చేరుకుంటారు. దర్గాను దర్శించుకున్న వారికి కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం.

దర్గా వద్ద జరుగనున్న కార్యక్రమాలు

ఫ 21న మంగళవారం రాత్రి 11 గంటల నుం చి తెల్లవారుజామున 5 గంటల వరకు గంధం ఊరేగింపు,

ఫ 22న దర్గా వద్ద అన్నదానం, గుట్టపై ఓం శ్రీ గిరి మక్కా మహేశ్వరస్వామి వారి కల్యాణం

ఫ 23న భక్తులతో తిరాకులు(దీపారాధన), న్యా దులు (కందుర్లు) మొక్కులు చెల్లిస్తారు.

23 నుంచి దేవరకొండలో చిన్నదర్గా ఉర్సు ఉత్సవాలు

దేవరకొండ: దేవరకొండ పట్టణంలోని హజ్రత సయ్యద్‌ సులేమాన శాఖాద్రి చిన్నదర్గా ఉర్సు ఉత్సవాలు ఈ నెల 23 నుంచి 24వ తేదీ వరకు జరగనున్నాయి. అందుకుగాను దర్గాను ఉర్సు ఉత్సవాల కు ముస్తాబు చేసినట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు సయ్యద్‌ అప్జ ల్‌, ఉస్మాన తెలిపారు. 23న దేవరకొండ మునినిసిపల్‌ కార్యాలయం నుంచి దర్గా వరకు నిర్వహించనున్న గంధం ఊరేగింపును ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌, మున్సిపల్‌ చైర్మన నర్సింహ ప్రారంభించనున్నారు.

Updated Date - 2023-02-21T00:51:53+05:30 IST