లక్ష మందితో ‘హిందూ ఏక్తా యాత్ర’

ABN , First Publish Date - 2023-05-06T02:24:02+05:30 IST

కరీంనగర్‌లో భారీ ఎత్తున ‘హిందూ ఏక్తా యాత్ర’ నిర్వహించనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తెలిపారు. లక్ష మందితో ఈనెల 14న నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి అసోం

లక్ష మందితో ‘హిందూ ఏక్తా యాత్ర’

హైదరాబాద్‌, మే 5 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్‌లో భారీ ఎత్తున ‘హిందూ ఏక్తా యాత్ర’ నిర్వహించనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తెలిపారు. లక్ష మందితో ఈనెల 14న నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కూడా ఈ యాత్రకు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలిసింది. పార్టీలు, వర్గాలు, వర్ణాలకు అతీతంగా నిర్వహిస్తున్న ఈ యాత్రకు అన్ని జిల్లాల నుంచి హిందువులు తరలిరావాలని, హిందూ ధర్మ రక్షణ కోసం పాటుపడే ప్రతి ఒక్కరూ దీనిలో పాల్గొనాలని బండి సంజయ్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ‘ఏక్తా యాత్ర’ ఏర్పాట్లపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘80 శాతం జనాభా ఉన్న హిందువులకు సంబంధించి కొత్త సచివాలయంలో నల్ల పోచమ్మ గుడికి రెండున్నర గుంటలు కేటాయిస్తే, 10 శాతం కూడా లేని వర్గానికి సంబంధించిన మసీదుకు ఐదు గుంటలు ఇచ్చిండ్రు. కేసీఆర్‌ ప్రభుత్వం హిందువుల పట్ల ఎంత అన్యాయంగా వ్యవహరిస్తుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. అందుకే హిందువుల సంఘటిత శక్తిని చాటి చెప్పేలా ఏక్తా యాత్ర కొనసాగాలి. హిందువులను ఏకం చేయడమే ఈ కార్యక్రమ లక్ష్యం’’ అని బండి సంజయ్‌ పేర్కొన్నారు.


Updated Date - 2023-05-06T02:24:02+05:30 IST