హైదరాబాద్ మూసీ నదిపై కేంద్రం క్లారిటీ ఇచ్చేసింది

ABN , First Publish Date - 2023-07-20T16:26:40+05:30 IST

హైదరాబాద్ మూసీ నది కాలుష్య నివారణపై ఎటువంటి ప్రతిపాదనా లేదని పార్లమెంట్‌లో కేంద్రం తేల్చిచెప్పింది. మూసీ నది కాలుష్య నివారణకు ఎటువంటి ప్రతిపాదన ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో లేదని కేంద్ర జలశక్తి శాఖ లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది.

హైదరాబాద్ మూసీ నదిపై కేంద్రం క్లారిటీ ఇచ్చేసింది

ఢిల్లీ: హైదరాబాద్ మూసీ నది (hyderabad musi river) కాలుష్య నివారణపై ఎటువంటి ప్రతిపాదనా లేదని పార్లమెంట్‌లో (new parliament ) కేంద్రం తేల్చిచెప్పింది. మూసీ నది కాలుష్య నివారణకు ఎటువంటి ప్రతిపాదన ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో లేదని కేంద్ర జలశక్తి శాఖ లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. మూసీ నదిపై స్కైవే నిర్మాణానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana State Govt) నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి ప్రతిపాదన రాలేదని జలశక్తి శాఖ పేర్కొంది. బీఆర్ఎస్ (BRS) లోక్‌సభ సభ్యులు గడ్డం రంజిత్‌ రెడ్డి, మాలోత్‌ కవితలు అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. 2018 సెప్టెంబర్‌ నాటికి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నివేదిక ప్రకారం... తెలంగాణలోని హైదరాబాద్ నుంచి నల్గొండ వరకు ఉన్న మూసీ నది ప్రాధాన్యత-1 కేటగిరీ కింద ఉందని కేంద్రం తెలిపింది. 2022 నవంబర్‌ నివేదిక ప్రకారం... బాపూఘాట్ నుంచి రుద్రవెల్లి వరకు, కాసానిగూడ నుంచి వలిగొండ వరకు మూసీ నది ప్రాధాన్యత-1 గుర్తించినట్లు లిఖితపూర్వక సమాధానంలో కేంద్రం వెల్లడించింది.

Updated Date - 2023-07-20T16:26:40+05:30 IST