TSPSC : సిట్ విచారణపై 5 లోపు రిపోర్ట్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు

ABN , First Publish Date - 2023-04-28T12:38:44+05:30 IST

TSPSC పేపర్ లీక్‌ కేసుపై హైకోర్టులో విచారణ నేడు విచారణ జరిగింది. కేసు విచారణను జూన్‌ 5కు హైకోర్టు వాయిదా వేసింది

TSPSC : సిట్ విచారణపై 5 లోపు రిపోర్ట్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు

హైదరాబాద్ : TSPSC పేపర్ లీక్‌ కేసుపై హైకోర్టులో విచారణ నేడు విచారణ జరిగింది. కేసు విచారణను జూన్‌ 5కు హైకోర్టు వాయిదా వేసింది. కేసు దర్యాప్తును ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. విచారణపై స్టేటస్‌ రిపోర్టు జూన్‌ 5 లోపు సమర్పించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందిని ప్రశ్నించారా?అని ప్రశ్నించింది. సిట్‌ దర్యాప్తుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. దర్యాప్తు వేగవంతం చేయాలని సిట్‌కు సూచించింది. ఎఫ్ఎస్ఎల్ (FSL) రిపోర్ట్‌ కోసం ఎదురుచూస్తున్నామని ఏజీ తెలిపింది. జూన్‌ 5లోపు నివేదిక ఇవ్వాలని సిట్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Updated Date - 2023-04-28T12:46:26+05:30 IST