తారకరత్న నివాసానికి బాలకృష్ణ.. మరికాసేపట్లో ఫిలింఛాంబర్‌కు భౌతికకాయం

ABN , First Publish Date - 2023-02-20T08:46:33+05:30 IST

తారకరత్న నివాసానికి నందమూరి బాలకృష్ణ చేరుకున్నారు. మరి కాసేపట్లో తారకరత్న భౌతికకాయం ఫిల్మ్‌ఛాంబర్‌కు చేరుకోనుంది. అభిమానుల సందర్శనార్థం భౌతిక కాయాన్ని మధ్యాహ్నం వరకూ అభిమానుల సందర్శనార్ధం ఫిలిం ఛాంబర్‌లోనే ఉంచనున్నారు.

తారకరత్న నివాసానికి బాలకృష్ణ.. మరికాసేపట్లో ఫిలింఛాంబర్‌కు భౌతికకాయం

హైదరాబాద్: తారకరత్న నివాసానికి నందమూరి బాలకృష్ణ చేరుకున్నారు. మరి కాసేపట్లో తారకరత్న భౌతికకాయం ఫిల్మ్‌ఛాంబర్‌కు చేరుకోనుంది. అభిమానుల సందర్శనార్థం భౌతిక కాయాన్ని మధ్యాహ్నం వరకూ అభిమానుల సందర్శనార్ధం ఫిలిం ఛాంబర్‌లోనే ఉంచనున్నారు. సాయంత్రం మహాప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన భౌతికకాయానికి సినీ, రాజకీయ ప్రముఖుల నివాళులు అర్పిస్తున్నారు.

నందమూరి తారకరత్న(40) శనివారం రాత్రి బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. టీడీపీ యువనేత నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు జనవరి 27న కుప్పం వెళ్లిన ఆయన.. అక్కడ గుండెపోటుకు గురై తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. జనం మధ్యనే ఒక్కసారిగా కుప్పకూలిన తారకరత్నను పార్టీ కార్యకర్తలు వెంటనే కుప్పంలోని కేసీ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం పీఈఎస్‌ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అదే రోజు రాత్రి గ్రీన్‌ చానల్‌ ద్వారా ఆయన్ను బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు. గుండెపోటుకు గురైన సమయంలో తారకరత్న మెదడుకు దాదాపు 45 నిమిషాలు రక్తప్రసరణ ఆగిపోవడంతో మెదడులోని కొంతభాగం దెబ్బతిన్నట్లు వైద్యులు గుర్తించారు.

Updated Date - 2023-02-20T08:47:05+05:30 IST

News Hub