Tarakaratna: తారకరత్నకు అసలు ఏం జరిగింది..! డాక్టర్ చెప్పిన షాకింగ్ నిజాలు
ABN , First Publish Date - 2023-02-19T13:16:52+05:30 IST
టీడీపీ (TDP) యువనాయకులు, టాలీవుడ్ నటుడు నందమూరి తారకరత్న(Actor Nandamuri Tarakaratna) మృతి పట్ల అందరూ దిగ్భ్రాంతి చెందుతున్నారు.
హైదరాబాద్: టీడీపీ (TDP) యువనాయకులు, టాలీవుడ్ నటుడు నందమూరి తారకరత్న(Actor Nandamuri Tarakaratna) మృతి పట్ల అందరూ దిగ్భ్రాంతి చెందుతున్నారు. అయితే ఇటీవల కాలంలో గుండెపోటు మరణాలు ఎక్కువ అయిపోయాయి. మరీ చిన్న వయసులోనే ఇలా చనిపోతుండడంపై అంతటా ఆందోళన వ్యక్తమవుతోంది. గతంలో కన్నడ పవర్ స్టార్ పునిత్‌రాజ్‌కుమార్ కూడా గుండెపోటుకు గురై మరణించిన సంగతి తెలిసిందే. ఎంతో ఫిట్‌గా ఉండే సినీ హీరోలు హఠాన్మారణానికి గురవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇక దాదాపు 23 రోజులపాటు మృత్యువుతో పోరాడిన తారకరత్న చివరకు ఈ లోకాన్ని శాశ్వతంగా వీడిపోయారు. అయితే గుండెపోటుకు గురైనప్పుడు ఆయన మెదడుకు దాదాపు 45 నిమిషాలపాటు రక్త ప్రసరణ ఆగిపోయింది. విదేశీ వైద్యులు వచ్చి చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. అసలు గుండెపోటు వచ్చే ముందు ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి. దానిని ఎదుర్కోవడం ఎలా.. క్రమశిక్షణాయుతమైన జీవతం గడిపేవారు సైతం గుండెపోటుకు ఎందుకు గురవుతున్నారు.
మరీ చిన్న వయసులోనే గుండెపోటు మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయి. కోవిడ్ తర్వాత గుండెపోటులు వస్తున్నాయన్నది వాస్తవం కాదని డాక్టర్ ముఖర్జీ తెలిపారు. కోవిడ్‌కు ముందు 2009 నుంచి 2016 వరకు ఫిపా క్రీడాకారుల సెన్సెస్ చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ ఆడుతున్నప్పుడు సడెన్‌గా సమస్యలు వచ్చి 600 మంది ఫుట్‌బాల్ ఆటగాళ్లు చనిపోయారని వాళ్లు చెప్పారని డాక్టర్ తెలిపారు. సడెన్‌గా గుండెపోటు రావడం కోవిడ్ కన్నా ముందు కూడా ఉన్నాయని చెప్పారు. కోవిడ్ వల్లే కచ్చితంగా గుండెపోటు రాదని డాక్టర్ తెలిపారు. కోవిడ్ వల్ల గుండెపోటు వస్తుందని కచ్చితమైన ఆధారం లేకపోయినా కోవిడ్ కూడా ఒక విధమైన డిస్ ఫ్యాక్టర్‌గా తీసుకోవాలని చెప్పారు. గుండెలో 90 నుంచి 95 శాతం బ్లాక్స్ ఉన్నా కూడా ప్రత్యేకంగా షుగర్ ఉన్న వాళ్లకు సింటమ్స్ ఉండకపోవచ్చు. గుండెపోటు వచ్చే ముందు ఒక రక్తనాళం 100 శాతం మూసుకుపోతుందని డాక్టర్ చెప్పారు. సడెన్‌గా రక్తనాళం 100 శాతం మూసుకుపోవడం వల్ల గుండెపోటు వస్తుందన్నారు. ఒక రక్తనాళంలో ఉన్న బ్లాక్‌పై పగుళ్లు ఏర్పడినప్పుడు పగుళ్లపై రక్తం గడ్డ కట్టడం వల్ల రక్తనాళం పూర్తిగా మూసుకుపోతుందని, రక్తం గడ్డ కట్టడానికి కొన్ని నిమిషాలు మాత్రమే పడుతుందని, అప్పటి వరకు బ్లాక్స్ ఉన్నా కూడా ఆయన నార్మల్‌గా ఉన్నా కూడా సడెన్ క్లాట్ ఫామ్ అవడం వల్ల రక్తనాళంలో రక్త ప్రసరణ పూర్తిగా మూసుకుపోవడం వల్ల సడెన్‌గా గుండెపోటు వస్తోందని డాక్టర్ స్పష్టం చేశారు.
టాలీవుడ్ నటుడు నందమూరి తారకరత్న (Nandamuri Tarakaratna) శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో కుటుంబ సభ్యులు, నందమూరి, నారా అభిమానులు, టీడీపీ కార్యకర్తలు శోకసంద్రంలో మునిగిపోయారు. మూడు వారాల కిందట టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) యువగళం (Yuva Galam) పాదయాత్రలో తారకరత్నకు గుండెపోటు (Heart Attack) వచ్చింది. దీంతో ప్రాథమిక చికిత్స కోసం స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించి ఆ తర్వాత కుప్పంలోని ప్రముఖ పీఈఎస్‌కు (PES) తరలించారు. ఆరోగ్యం మెరుగుకాకపోవడంతో అర్ధరాత్రి కుప్పం (Kuppam) నుంచి బెంగళూరులోని (Bangalore) నారాయణ హృదయాలయ (Narayana Hrudayalaya) ఆస్పత్రికి తరలించారు. వైద్య నిపుణులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. ఆఖరికి విదేశాల నుంచి వచ్చిన డాక్టర్లు శాయశక్తులా ప్రయత్నించినా ట్రీట్మెంట్‌కు తారకరత్న శరీరం సహకరించలేదు. 23 రోజులుగా బెంగళూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తారకరత్న శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు.
బెంగళూరు హాస్పిటల్ వెనుక గేటు నుంచి అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు తారకరత్న మృతదేహం తరలించారు. హైదరాబాద్‌లోని మోకిలలోని తన నివాసంలో తారకరత్న భౌతికకాయానికి ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. సందర్శనార్థం రేపు తెలుగు ఫిలిం చాంబర్‌లో తారకరత్న భౌతికకాయాన్ని ఉంచుతారు. రేపు ఉదయం 7 నుంచి సాయంత్రం 4 వరకు ఫిలిం చాంబర్‌లో తారకరత్న భౌతికకాయం ఉంటుంది. రేపు సాయంత్రం 5 గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.
ఈ వార్తలు కూడా చదవండి
కన్నా జనసేనలోకా, టీడీపీలోకా అనే ప్రశ్నకు సమాధానం వచ్చేసింది..!
నన్ను అరెస్ట్ చేసి ఉండేవారు : మనీశ్ సిసోడియా