21న కేబుల్‌ బ్రిడ్జి ప్రారంభం

ABN , First Publish Date - 2023-06-05T23:49:26+05:30 IST

కరీంనగర్‌కు తలమానికంగా రూపుదిద్దుకున్న కేబుల్‌ బ్రిడ్జిని ఈ నెల 21న ప్రారంభించనున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు.

21న కేబుల్‌ బ్రిడ్జి ప్రారంభం
అధికారులతో మాట్లాడుతున్న మంత్రి గంగుల కమలాకర్‌

కరీంనగర్‌టౌన్‌, జూన్‌ 5: కరీంనగర్‌కు తలమానికంగా రూపుదిద్దుకున్న కేబుల్‌ బ్రిడ్జిని ఈ నెల 21న ప్రారంభించనున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. సోమవారం ఆయన కేబుల్‌ బ్రిడ్జిని సందర్శించి ప్రారంభోత్సవ ఏర్పాట్లపై అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేబుల్‌ బ్రిడి ప్రారంభోత్సవానికి రాష్ట్ర మున్సిపల్‌, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావుతోపాటు పలువురు ఉన్నతాధికారులు హాజరవుతారని తెలిపారు. ఈ నెల 21, 22న రెండు రోజులపాటు తీగల వంతెన సమీపంలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించామన్నారు. కమాన్‌ నుంచి కేబుల్‌ బ్రిడ్జి మీదుగా సదాశివపల్లి వరకు రోడ్డు పనులు పూర్తయినందున లైటింగ్‌ ఏర్పాటు చేయాలని, డైనమిక్‌ లైటింగ్‌, క్రాకర్‌ షో, లేజర్‌ షో, కేబుల్‌ బ్రిడ్జి ప్రారంభానికి అవసరమైన ఏర్పాట్లను అద్భుతంగా చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, ఎమ్మెల్యేరసమయి బాలకిషన్‌, మేయర్‌ సునీల్‌రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ పొన్నం అనిల్‌ కుమార్‌గౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-06-05T23:49:26+05:30 IST