Home » Karimnagar
తెలంగాణ జాగృతి సంస్థ వ్యవస్థాపకురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం జగిత్యాలలో పర్యటించనున్నారు. దరూర్ ఎస్సారెస్పి కెనాల్ అంబేద్కర్ విగ్రహం వద్ద క్యాడర్ను ఉద్దేశించి కవిత ప్రసంగిస్తారు.
ప్రభుత్వ వసతి గృహాలు, గురుకుల విద్యాలయాల్లోని విద్యార్థుల మెస్చార్జీలు, కాస్మెటిక్ చార్జీలను గత నెల 1వ తేదీన ప్రభుత్వం పెంచించింది. శనివారం నుంచి పెరిగిన చార్జీలు అమల్లోకి వచ్చాయి. దీంతో ఇక నుంచి విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికాహారం అందనున్నది.
వికారాబాద్, కరీంనగర్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో శనివారం అకస్మాత్తుగా కురిసిన వర్షం రైతులను కన్నీరు పెట్టించింది. పలు ప్రాంతాల్లో ఆరబోసిన ధాన్యం అకాల వర్షం దెబ్బకు తడిచిపోయింది. ధాన్యాన్ని రక్షించుకునేందుకు రైతులు నానావస్థలు పడ్డారు.
పెద్దపల్లి జిల్లాలో బుఽధవారం ఉదయం 7 గంటల 23 నిమిషాల కు 5 సెకండ్ల పాటు స్వల్పంగా భూకంపం సంభవించిం ది.
కొడుకు మూర్ఖుడైనా, కూతురుంటే కనీసం అన్నం పెడుతుందంటారు. అందుకే సంతానంలో ఒక్క ఆడపిల్లైనా ఉండాలని పెద్దలు చెబుతుంటారు. కానీ ముగ్గురు ఆడపిల్లలుండి కూడా తమ కన్నతల్లి చనిపోతే కనీసం చూడటానికి రాని హృదయవిదారక ఘటన కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామంలో జరిగింది.
ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బూరుగుపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జరిగింది.
‘‘రాష్ట్రంలో భూసేకరణ చేయడం నేరమా? పరిశ్రమల స్థాపన కోసం భూసేకరణ చేయొద్దా? నిరుద్యోగులకు ఉద్యోగాలివ్వొద్దా? పరిశ్రమలు ఏర్పాటు చేయకపోతే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది? భూసేకరణ చేయకుండా మీరు ప్రాజెక్టుల నిర్మాణం ఎలా చేపట్టారు?’’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. మాజీ సీఎం కేసీఆర్ను ప్రశ్నించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి నిప్పులు చెరిగారు. కేటీఆర్ కుట్రలను గమనిస్తున్నామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ఊచలు లెక్కపెట్టాల్సి వస్తుందని రేవంత్ రెడ్డి కేటీఆర్కు వార్నింగ్ ఇచ్చారు.
రాజన్న క్షేత్రంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఎన్నో ఏళ్లుగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి, విస్తరణ పనులకు కదలిక మొదలైంది. బుధవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు తొలిసారిగా ముఖ్యమంత్రి హోదాలో రానున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది.
విద్యార్థులు సర్కారు కొలువు కొట్టాలనే పట్టుదలతో రాత్రింబవళ్లు క ష్టపడి చదువుతున్నారు. జిల్లా గ్రంథాలయంతో పాటు ప్రైవేట్, ఆన్లైన్ కోచింగ్ సెంటర్ల ద్వారా పరీక్షకు సన్న ద్ధమవుతున్నారు. ఏళ్ల తరబడి ప్రిపరేషన్కే పరిమిత మైన యువత..ఇటీవల డీఎస్సీతో కొంత ఉపశమనం పొందగా...వరుస నోటిఫికేషన్లతో రెట్టింపు ఉత్సాహంతో ఉన్నారు