వైన్‌షాపుల కోసం నోటిఫికేషన్ జారీ
ABN , First Publish Date - 2023-08-04T23:58:34+05:30 IST
జిల్లాలోని 94 వైన్‌షాపు ల లైసెన్స్‌ల ఎంపిక కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తూ శుక్రవారం జిల్లా ఎక్సైజ్ సూపరింటెం డెంట్ (ఈఎస్) పి శ్రీనివాసరావు నోటిఫికేషన్ విడుదల చేశారు.
అర్బన్ ఎక్సైజ్‌స్టేషన్‌లో 5 కౌంటర్‌ల ఏర్పాటు
మొదటి రోజు 5 దరఖాస్తులు
ఒక వ్యక్తి ఎన్ని షాపులకైనా దరఖాస్తు చేసుకోవచ్చు
కరీంనగర్ క్రైం, ఆగస్టు 4: జిల్లాలోని 94 వైన్‌షాపు ల లైసెన్స్‌ల ఎంపిక కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తూ శుక్రవారం జిల్లా ఎక్సైజ్ సూపరింటెం డెంట్ (ఈఎస్) పి శ్రీనివాసరావు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ మేరకు కరీంనగర్ అర్బన్ ఎక్సైజ్ స్టేషన్‌లో ఆయన విలేకరుల సమా వే శంలో వివరాలు వెల్లడించారు. గోదాంగడ్డ అయ్యప్ప టెంపుల్ వద్ద ఉన్న కరీంనగర్ అర్బన్ ఎక్సైజ్ స్టేషన్‌లో కరీంనగర్ అర్బన్, రూరల్, హుజూరా బాద్, తిమ్మాపూర్, జమ్మికుంట ఎక్సైజ్ స్టేషన్‌లవారీగా ప్రత్యేక కౌంటర్ లను ఏర్పాటు చేశారు.
శుక్రవారం నుంచి ఈ నెల 17వ తేదీ వరకు ఆదివారాలు మినహా దరఖాస్తులను సంబంధిత కౌంటర్‌లో ఉదయం 11 గంటల నుంచి సా యంత్రం 5 గంటల వరకు స్వీకరిస్తారు. జిల్లా పరిధిలోని 94 మద్యం షాపులకు 3 స్లాబ్‌ల పరిధిలోకి రానున్నాయి. ఇందులో ఏడాదికి 50 లక్షల రూపాయల ఫీజుతో షాపులు 15, 55 లక్షల ఫీజుతో 44, 65 లక్షల ఫీజుతో 35 వైన్‌షాపులు ఉన్నాయి. లైసెన్స్ ఫీజుకు అదనంగా ఏడాదికి 5 లక్షల రూపాయల స్పెషల్ ఎక్సైజ్ టాక్స్, వాకిన్ షాపు ఏర్పాటు చేసుకుంటే ఏడాదికి మరో 5 లక్షల రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. జిల్లా లోని 94 వైన్‌షాపులలో 17 షాపులు గౌడ్‌లకు, 9 ఎస్సీలకు రిజర్వు చేశారు. వైన్‌షాపులకు సింగిల్ దరఖాస్తు వచ్చిన సందర్భంలో ఆ మద్యం షాపులను ముందుగానే ఖరారు చేసి ప్రకటిస్తారు.
ఒకటికి మించి దరఖాస్తులు వచ్చిన సందర్భంలో లాటరీ ద్వారా లైసెన్స్‌దారులను ఖరారు చేయనున్నారు. ఎక్సైజ్ సూపరిటెండెంట్ కార్యాలయంలో గతంలో మాదిరిగానే డీఈపీఓ కరీంనగర్ పేరిట 2 లక్ష రూపాయల డిడి లేదా చాలన్ జతచేసి, 3 పాస్‌పోర్ట్ కలర్ ఫొటోలు, ఆధార్ పాన్‌కార్డులపై సెల్ఫ్ అటెస్టేషన్‌తో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. 25 సంవత్సరాల వయస్సు పైబడిన వారే లైసెన్స్‌లకు అర్హులుగా పేర్కొన్నారు. రిజర్వుడ్ షాపులకు ఆయా కేటగిరీలకు చెం దిన వారు కుల ధ్రువీకరణ పత్రాలు జతచేయాల్సి ఉంటుంది. ఈ ఎక్సైజ్ టాక్స్‌లోనే పర్మిట్‌రూంల ఫీజులు కూడా కలిసి ఉన్నాయి. మద్యం షాపు లైసెన్స్ కోసం ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఎక్సైజ్ టాక్స్‌ను గతం లో మాదిరిగా 6 విడతల్లో చెల్లించేందుకు వీలు కల్పించారు. 21వ తేదీన కలె క్టరేట్ ఆడిటోరియంలో ఉదయం 11 గంట లకు లాటరీ ద్వారా లైసెన్సీలను ఎంపిక చేయనున్నారు. వైన్‌షాపుల లైసెన్స్‌కు ఎంపికైన వారికి 22వ తేదీలోగా లైసెన్స్ ఫీజు మొదటి వాయిదా చెల్లించాల్సి ఉంటుంది. నవంబరు 30న కొత్త వైన్ షాపుల కు మద్యం స్టాక్‌ను జారీ చేస్తారు. డిసెంబరు 1వ తేదీ నుంచి కొత్త లైసెన్సీదారులు మద్యం అమ్మకాలను ప్రారంభిస్తారు. మద్యం అమ్మకా లు లైసెన్సు ఫీజుల్లో 10 రెట్ల వరకు మార్జిన్ విధానాన్ని అమలు చేయను న్నారు. మద్యం అమ్మకాలు లైసెన్సు ఫీజు కంటే 10 రెట్లకు మించి జరిగితే లైసెన్సీల మార్జిన్ 4 శాతానికి కుదించారు.
మద్యం వ్యాపారులకు ఆర్డీనరీ మద్యం అమ్మకాలపై 27 శాతం, మీడి యం రకం అమ్మకాలపై 20 శాతం, బీర్‌పై 20 శాతం మార్జిన్‌ను ప్రభుత్వం ప్రకటించింది. ఒక వ్యక్తి ఎన్ని వైన్‌షాపులకైనా దర ఖాస్తు చేసు కో వచ్చని, లాటరీలో ఒక వ్యక్తికి ఎన్ని షాపులు వచ్చినా జారీ చేస్తామని తెలిపారు. డీఫాల్టర్, ఐపీ పెట్టిన వ్యక్తులు, ఏదైనా కేసుల్లో జరిమానా చెల్లించిన వారు దరఖాస్తుకు అనర్హులని ఈస్ పి శ్రీనివాసరావు తెలిపా రు. కాగా వైన్‌షాపుల లైసెన్స్‌ల కోసం మొదటి రోజు కరీంనగర్ అర్బన్ స్టేషన్‌లో 4, రూరల్ స్టేషన్‌లో 1 దరఖాస్తు అందాయి. ఈ సమావేశంలో అసిస్టెం ట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ టి తాతాజీ, ఎక్సైజ్ సీఐలు కే నాగే శ్వర్‌రావు, జి దుర్గా భవాని, ఇంద్రప్రసాద్, ఎండీ అక్బర్‌హుస్సేన్, స్వరూప తదితరులు పాల్గొన్నారు.