Vemulawada: వీడు మాములోడు కాదు.. భార్య చనిపోయి వయసు పైబడిన వారికి పెళ్లి చేస్తానని..

ABN , First Publish Date - 2023-02-28T11:40:25+05:30 IST

పెళ్లి పేరుతో పలువురిని మోసం చేస్తున్న ఓ వ్యక్తిని వేములవాడ పోలీసులు పట్టుకుని బాధితుడి ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేశారు.

Vemulawada: వీడు మాములోడు కాదు.. భార్య చనిపోయి వయసు పైబడిన వారికి పెళ్లి చేస్తానని..

వేములవాడ (ఆంధ్రజ్యోతి): పెళ్లి పేరుతో పలువురిని మోసం (Marriage Fraud) చేస్తున్న ఓ వ్యక్తిని వేములవాడ(Vemulawada) పోలీసులు పట్టుకుని బాధితుడి ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేశారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం తాటిపల్లికి చెందిన లక్ష్మణ్ భార్య 20 సంవత్సరాల క్రితం చనిపోయింది. రెండో పెళ్లి కోసం ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో ఎనిమిది నెలల కిందట కర్ణాటకకు చెందిన శివకుమార్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. శివకుమార్ కొంత డబ్బు లక్ష్మణ్ వద్ద తీసుకొని ఓ మహిళతో పెళ్లి(Marriagae) చేశాడు. పెళ్లి చేసుకున్న మహిళ తల్లిగారి ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి కనిపించకుండా పోయింది. దీంతో లక్ష్మణ్ మధ్యవర్తి శివకుమార్ కు ఫోన్ చేసి చెప్పాడు. తొలుత ఫోన్ లో మహిళతో మాట్లాడించాడు. ఆ తర్వాత ఫోన్ కాల్ కు జవాబు ఇవ్వకపోవడంతో మోసపోయినట్లు గ్రహించాడు.

ఈ క్రమంలో అదే మహిళతో జగిత్యాల(Jagtial) జిల్లాకు చెందిన మరో వ్యక్తితో పెళ్లి జరిపించినట్లు లక్ష్మణ్ కు సమాచారం అందింది. పెళ్లికి సంబంధించిన వీడియోలు(Video) కూడా ఉండడంతో బ్రోకర్ శివకుమార్ కోసం గాలింపు ప్రారంభించాడు. శివకుమార్ బోయినపల్లి మండలంలోని మరో జంటకు పెళ్లి జరిపించేందుకు వేములవాడకు వచ్చాడు. శివకుమార్ ని పట్టుకొని వేములవాడ పోలీసులకు అప్పగించారు. శివకుమార్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పెళ్లిళ్ల పేరిట మోసం చేసే వారిపట్ల జాగ్రత్తగా ఉండాలని సీఐ వెంకటేశ్ సూచించారు.

Updated Date - 2023-02-28T11:40:25+05:30 IST