TS Rains : భారీ వర్షాలతో కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం.. రెండ్రోజుల పాటు సెలవులు..

ABN , First Publish Date - 2023-07-20T20:32:59+05:30 IST

తెలంగాణలో గత మూడ్రోజులుగా భారీగా వర్షాలు (Heavy Rains) కురుస్తున్న విషయం తెలిసిందే. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో జనజీవనం స్థంభించగా.. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. మరో ఐదురోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం (TS Govt) కీలక నిర్ణయం తీసుకుంది. రేపు అనగా శుక్రవారం, శనివారం రెండ్రోజులపాటు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.

TS Rains : భారీ వర్షాలతో కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం.. రెండ్రోజుల పాటు సెలవులు..

తెలంగాణలో గత మూడ్రోజులుగా భారీగా వర్షాలు (Heavy Rains) కురుస్తున్న విషయం తెలిసిందే. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో జనజీవనం స్థంభించగా.. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. మరో ఐదురోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం (TS Govt) కీలక నిర్ణయం తీసుకుంది. రేపు అనగా శుక్రవారం, శనివారం రెండ్రోజులపాటు జీహెచ్ఎంసీ పరిధిలోని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. విద్యా సంస్థలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు కూడా రెండ్రోజులు సెలవు ప్రకటించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని సీఎం కేసీఆర్ (CM KCR) ఆదేశించారు. దీంతో జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలోని అన్ని రకాల విద్యాసంస్థలు సహా ప్రభుత్వ కార్యాలయాలు రేపు, ఎల్లుండి తెరవాడనికి వీల్లేదు. ప్రైవేట్ స్కూళ్లు, సంస్థలు కూడా వారి కార్యాలయాలకు సెలవులు ప్రకటించేలా చర్యలు చేపట్టాలని కార్మికశాఖను కేసీఆర్ ఆదేశించారు. ప్రభుత్వం ఆదేశాలను పట్టించుకోకుండా ఉల్లంఘిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది సర్కార్.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

RAINS.jpg

వీటికి మాత్రమే..!

అయితే.. వైద్యం, పాల సరఫరా తదితర అత్యవసర సేవలు కొనసాగుతాయని సీఎం తెలిపారు. కాగా.. గురువారం, శుక్రవారం నాడు సెలవులు ప్రకటిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్ చేయడానికి మునుపే స్కూళ్లు ప్రారంభం కావడంతో ప్రభుత్వంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ప్రకటన వచ్చేలోపే కొన్ని స్కూళ్లు ప్రారంభం కూడా అయ్యాయి. దీంతో విద్యార్థులంతా స్కూళ్లకు వెళ్లాక.. సెలవులు ప్రకటించడమేంటంటూ తల్లిదండ్రులు, సామాన్య ప్రజలు ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. వర్షాల విషయంలో ప్రభుత్వానికి ముందు జాగ్రత్తలు లేవని తల్లిదండ్రులు సైతం విమర్శలు చేస్తున్నారు. అందుకే.. ఈ విమర్శలతో మరోసారి ఇలాంటి ఇది రిపీట్ కాకుండా ఉండేందుకు ముందుగానే ఆ సెలవులు పొడిగిస్తున్నట్లు గురువారం రాత్రి ప్రభుత్వం ఓ ప్రకటనను రిలీజ్ చేసింది.

hyd-rains.jpg

కీలక ఆదేశాలు..

ఇదిలా ఉంటే.. గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదావరీ (Godavari) నది ఉదృతంగా ప్రవహిస్తున్నందున ప్రభుత్వం మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసింది. ఈ నేపథ్యంలో చేపట్టవలసిన అత్యవసర చర్యల పట్ల కేసీఆర్.. సీఎస్‌కు పలు ఆదేశాలు జారీ చేశారు. పోలీసు సహా ప్రభుత్వ యంత్రాంగాన్ని సంబంధిత శాఖల ఉన్నతాధికారులను అప్రమత్తం చేస్తూ తక్షణ చర్యలకు ఉపక్రమించాలని ఆదేశించారు. భద్రాలంలో ముంపునకు గురయ్యే అవకాశాలున్న తోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్దంగా వుండాలన్నారు. గతంలో వరదల సందర్భంగా సమర్థవంతంగా పనిచేసిన అధికారుల సేవలను వినియోగించుకోవాలని సీఎం తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ కలెక్టర్‌గా పనిచేస్తున్న దురిశెట్టి అనుదీప్‌ను తక్షణమే బయలుదేరి భద్రాచలం వెళ్లి అక్కడి పరిస్థితులను బట్టి సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్దంగా ఉండాలని సీఎం ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంతో పాటు, కలక్టరేట్‌లో ఎమ్మార్వో కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఈ సందర్భంగా ప్రకటనలో ప్రభుత్వం తెలిపింది.


ఇవి కూడా చదవండి


Perni Nani : జగన్ సర్కార్‌పై పేర్ని నానికి ఇంత కోపమెందుకో.. మీడియా ముందే ఎందుకిలా..!?


Jr Ntr : ‘కాబోయే సీఎం జూనియర్ ఎన్టీఆర్’ అంటూ భారీగా ఫ్లెక్సీలు.. అసలు విషయం తెలిస్తే..?


Janasena : ఢిల్లీ వేదికగా కీలక ప్రకటన చేయనున్న పవన్.. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సర్వత్రా ఆసక్తి..!


TS Power Politics : రాహుల్‌తో పోలికేంటి కేటీఆర్.. మంత్రికి తెలిసిందల్లా ఒక్కటే.. దిమ్మదిరిగే కౌంటరిచ్చిన రేవంత్ రెడ్డి!


BRS Vs Revanth : కేటీఆర్.. ఎక్కడికి రమ్మంటావో చెప్పు.. ‘పవర్‌’పై తేల్చుకుందాం.. రేవంత్ రెడ్డి సవాల్


Chikoti Praveen : మరో వివాదంలో చికోటి ప్రవీణ్.. ఈసారి గట్టిగానే..?


Updated Date - 2023-07-20T21:34:41+05:30 IST

News Hub
The video is not available or it's processing - Please check back later.