KCR: ఆసుపత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్...
ABN , Publish Date - Dec 15 , 2023 | 11:29 AM
మాజీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు శుక్రవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. సోమాజిగూడ యశోద హాస్పటల్
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు శుక్రవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. సోమాజిగూడ యశోద హాస్పటల్ నుంచి నేరుగా నందినగర్ లోని తన పాత నివాసానికి ఆయన చేరుకున్నారు. గత వారం రోజుల క్రితం అనారోగ్యానికి గురైన కేసీఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందిన సంగతి తెలిసిందే.. 8వ తేదీ ఎడుమ కాలు తుంటి మార్పిడి ఆపరేషన్ను సోమాజిగూడ యశోద డాక్టర్లు నిర్వహించారు. శుక్రవారం ఆయన్ను డిశ్చార్జ్ చేశారు. కేసీఆర్ డిశ్చార్జి అవుతారని తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు నందినగర్‌లోని పాత ఇంట్లో ఆయన ఉండడానికి అవసరమైన ఏర్పాట్లు చేశారు. వైద్య సేవల కోసం తరచూ ఆస్పత్రికి వెళ్లేందుకు ఇబ్బంది కలగకుండా దగ్గరగా ఉంటుందని.. నందినగర్‌లోని ఇంట్లోనే ఉండాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారట.