TS News: భద్రాద్రి రామయ్య సన్నిధిలో భోగి, సంక్రాంతి వేడుకలు

ABN , First Publish Date - 2023-01-14T12:24:42+05:30 IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాద్రి (Bhadradri) రామయ్య (Ramaiah) సన్నిధిలో భోగి (Bhogi), సంక్రాంతి (Sankranthi) వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

TS News: భద్రాద్రి రామయ్య సన్నిధిలో భోగి, సంక్రాంతి వేడుకలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాద్రి (Bhadradri) రామయ్య (Ramaiah) సన్నిధిలో భోగి (Bhogi), సంక్రాంతి (Sankranthi) వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శనివారం ఉదయం సీతారాములకు బంగారు పుష్పాలతో (Golden Flowers) అర్చకులు అర్చన చేశారు. అనంతరం గోదాదేవి రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. ఈరోజు సాయంత్రం సీతారాములకు దసరా మండపం వద్ద విలాస ఉత్సవం నిర్వహిస్తారు. భోగి, సంక్రాంతి సందర్భంగా భద్రాద్రి రామయ్యను దర్శించుకునేందుకు ఆలయానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు.

కాగా భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో శుక్రవారం సంప్రదాయబద్థంగా విలాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి అలంకరణలో గోకులరామం మండపంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో దేవస్థానం పర్యవేక్షకుడు కత్తి శ్రీనివాస్‌, ఉభయ దాతలు హరిచంద్రనాయక్‌ కుటుంబ సభ్యులు, వైదిక పరిపాలన సిబ్బంది పాల్గొన్నారు. భద్రాద్రి రామయ్య శుక్రవారం స్వర్ణకవచంలో భక్తులకు దర్శనమిచ్చారు. నిత్య కళ్యాణ మండపంలో స్వామి వారికి సంప్రదాయబద్దంగా నిత్యకళ్యాణం నిర్వహించారు.

Updated Date - 2023-01-14T12:24:45+05:30 IST