Home » Bhadrachalam
వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలకు భద్రాచలం వచ్చే సీతారామచంద్రస్వామి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశించారు.
ములుగు ఏజన్సీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఒకవైపు మావోయిస్టుల ఎన్కౌంటర్.. మరోవైపు సోమవారం నుంచి మావోయిస్టుల పీఎల్జీఏ వారోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ముమ్మరంగా కూంబింగ్ చేపట్టారు. మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి పనులను నిలిపివేశారు.
దళితులకు రాజ్యాంగ అధికారం దక్కకూడదనే కుట్రతోనే ఎస్సీలను ఏ,బీ,సీ,డీలుగా వర్గీకరించారని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ ఆరోపించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలోని లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం 8 వ రోజు వీరలక్ష్మీ అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు.
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. 12న విజయదశమి సందర్భంగా భద్రాద్రి రామయ్యకు పట్టాభిషేకం, విజయోత్సవం, ఆయుధపూజ, శ్రీరామ్లీలా మహోత్సవం నిర్వహించనున్నారు. అక్టోబర్ 17న శబరి స్మృతియాత్ర సైతం నిర్వహించనున్నారు.
కోడలిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ప్రధానార్చకుడు పొడిచేటి సీతారామానుజాచార్యులుపై సస్పెన్షన్ వేటు పడింది.
భద్రాచలంలో శ్రీరామ టెంపుల్ ఆఫ్ యూఎస్ఏ ఖగోళయాత్ర బృందం ఆధ్వర్యంలో భద్రాద్రి సీతారాముల శాంతికల్యాణం నిర్వహించడంపై భద్రాచలం దేవస్థానం అధికారులు, వైదిక సిబ్బంది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ సారి గోదావరి వరద తుది ప్రమాద హెచ్చరికకు చేరువగా వచ్చినా ముందస్తు చర్యలతో ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా సమర్థవంతంగా ఎదుర్కొన్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
భారీ వర్షానికి ఇంటిగోడ కూలి ఒక వృద్ధురాలు, యాదాద్రి భువనగిరి జిల్లాలో వరదనీటిలో పడి మరో వృద్ధురాలు దుర్మరణం పాలయ్యారు.
ఎడతెరిపి లేని వర్షాలతో భద్రాద్రి జిల్లాలోని పెదవాగు ప్రాజెక్టు రింగ్ బండ్కు భారీ గండి పడింది.