రింగయ్యారు.. పాటకు దెబ్బకొట్టారు

ABN , First Publish Date - 2023-03-28T23:09:56+05:30 IST

చర్ల మేజర్‌ పంచాయితీలో నిర్వహించే పశువుల సంత పాటకు ఎంతో పోటీ ఉంటుంది.

రింగయ్యారు.. పాటకు దెబ్బకొట్టారు
పాట నిర్వహిస్తున్న దృశ్యం

చర్ల, మార్చి 28: చర్ల మేజర్‌ పంచాయితీలో నిర్వహించే పశువుల సంత పాటకు ఎంతో పోటీ ఉంటుంది. చత్తీస్‌ఘడ్‌ నుంచి వచ్చే పశువుల కోసం కొంత మంది వ్యాపారులు ఈ పాటను పాడేందుకు ముందుకొస్తుంటారు. మార్చి నెల ముగుస్తుండడంతో సోమవారం పశువుల సంత పాటతో పాటు, ఇతర పాటలను చర్ల మేజర్‌ పంచాయితీ ఆవరణలో నిర్వహించారు. చర్ల సర్పంచ్‌ కాపుల కృష్ణార్జున రావుతో పాటు, ఎంపీడీవో రామకృష్ణ, కార్యదర్శి కృష్ణ, ఎంపీపీ గీదా కోదండ రామయ్య, వైస్‌ సర్పంచ్‌ శిరిపురపు శివలు పాటలో పాల్గొన్నారు. కాగా పశువుల సంత పాటలో సుమారు 31 మంది గిరిజనులు పాల్గొన్నారు. చర్ల మండల కేంద్రానికి చెం దిన ఓ వ్యక్తి సుమారు 27లక్షల 30 వేల రూపాయలకు ఈ పాట ను దక్కించుకున్నాడు. కాగా ఈ పాట జరిగే క్రమంలో పాట దారు లు అంతా రింగ్‌ అయ్యారనే ప్రచారం సాగుతోంది. పాట ఎక్కువ కు పోకుండా అందరూ కలిసి మాట్లాడుకుని ఇలా తక్కువకు పా టను పాడుకున్నారని తెలుస్తోంది. వాస్తవానికి పాట ఇంకా ఎక్కువకు పోయేదని స్థానికులు చెబుతున్నారు. సుమారు మరో 10 లక్షలకు ఎక్కువకు పాట పాడేందుకు వ్యాపారులు ఆశక్తి చూపేం దుకు సిద్దంగా ఉన్నారని, కానీ రింగ్‌ అవ్వడం వలన పాట తక్కువకు పోయిందంటున్నారు. వ్యాపారులు అలా రింగ్‌ కావడంతో పంచాయితీ తీవ్రంగా నష్ట పోయిందని చెబుతున్నారు.

Updated Date - 2023-03-28T23:09:56+05:30 IST