రాష్ట్రం వరదల్లో ఉంటే మహారాష్ట్రలో సీఎం రాజకీయం

ABN , First Publish Date - 2023-08-02T00:40:26+05:30 IST

: రాష్ట్రంలో ఇటీవల భారీ వర్షాలతో వరదలు వచ్చి పలు జిల్లాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉంటే వరద సహాయక చర్యలు చేపట్టకుండా సీఎం కేసీఆర్‌ తన పార్టీ అభివృద్ధి కోసం మహరాష్ట్రకు వెళ్లి రాజకీయాలు చేస్తున్నారని టీపీసీసీ ప్రచారకమిటీ కో-చైర్మన, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నా వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో మంగళవారం పొంగులేటితన క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమవేశంలో పొంగులేటి మాట్లాడుతూ రాష్ట్రంలో వరదల వ

 రాష్ట్రం వరదల్లో ఉంటే మహారాష్ట్రలో సీఎం రాజకీయం
మాట్లాడుతున్న టీపీసీసీ ప్రచారకమిటీ కో-చైర్మన, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి

పీసీసీ ప్రచారకమిటీ కో-చైర్మన, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి

కొత్తగూడెం, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఇటీవల భారీ వర్షాలతో వరదలు వచ్చి పలు జిల్లాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉంటే వరద సహాయక చర్యలు చేపట్టకుండా సీఎం కేసీఆర్‌ తన పార్టీ అభివృద్ధి కోసం మహరాష్ట్రకు వెళ్లి రాజకీయాలు చేస్తున్నారని టీపీసీసీ ప్రచారకమిటీ కో-చైర్మన, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నా వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో మంగళవారం పొంగులేటితన క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమవేశంలో పొంగులేటి మాట్లాడుతూ రాష్ట్రంలో వరదల వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోయారన్నారు. నష్టాన్ని అంచనా వేయడంలోనూ ప్రభుత్వం విఫలమైందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రూ.1,500కోట్లకు పైగా నష్టం వాటిల్లితే రాష్ట్ర ప్రభుత్వం రూ.500కోట్లు మాత్రమే ప్రకటించి చేతులు దులుపుకుందన్నారు. ఇప్పటి వరకు నష్ట పరిహారాన్ని బాధితులకు పంపిణీ చేయలేదన్నారు. పథకాలకు ఆర్భాటంగా నిధులను ప్రకటించడం తరువాత వాటి గురించి మర్చిపోవడం కల్వకుంట్ల కుటుంబానికి అలవాటుగా మారిందన్నారు. గతంలో 55రోజులు నిరవధిక సమ్మె చేసినా ఆర్టీసీ కార్మికుల గురించి పట్టించుకోని సీఎం కేసీఆర్‌ ఇప్పుడు ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటించారన్నారు. ఆర్టీసీ వీలినాన్ని కాంగ్రెస్‌ పార్టీ స్వాగతిస్తోందన్నారు. వరద బాధితులకు కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో పూర్తి సహాయసహకారాలు అందిస్తూ నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నామన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని పొంగులేటి ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, పీసీసీ జనరల్‌ సెక్రటరీ ఎడవల్లి కృష్ణ, టీపీసీసీ సభ్యుడు నాగ సీతారాములు, జిల్లా కాంగ్రెస్‌ నాయకులు వూకంటి గోపాలరావు, తూము చౌదరి, విజయబాయి పాల్గొన్నారు.

Updated Date - 2023-08-02T00:40:26+05:30 IST