జై జై గణేషా

ABN , First Publish Date - 2023-09-19T23:44:30+05:30 IST

ఆదిదేవుడు వినాయకుడు కొలువుదీరాడు. బొజ్జ గణేశా.. వరముల్విగా రావయ్యా అంటూ ఆర్తితో పిలిచినా, పూజలందుకోగ రావయ్యా అని భక్తితో కొలిచినా ఆలకిం

 జై జై గణేషా

వాడవాడలా కొలువైన గణపయ్య

భక్తి శ్రద్ధలతో వినాయక చవితి

ఇరు జిల్లాల్లో నవరాత్రి సంబురాలు

ఖమ్మం సాంస్కృతికం, ఆగస్టు 19: ఆదిదేవుడు వినాయకుడు కొలువుదీరాడు. బొజ్జ గణేశా.. వరముల్విగా రావయ్యా అంటూ ఆర్తితో పిలిచినా, పూజలందుకోగ రావయ్యా అని భక్తితో కొలిచినా ఆలకించే గణనాథుడి నవరాత్రులు ఘనంగా ప్రారంభమయ్యాయి. వినాయక చవితి పండుగను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఇళ్లల్లో వినాయక పూజలతోపాటు వాడవాడలా గణపయ్యను పూజించేందకు ఆసక్తి చూపటంతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వేల సంఖ్యలో వినాయక పందిళ్లు ఏర్పాటయ్యాయి. పందిళ్లను రాజస్థాన, కలకత్తా కళాకారులు అద్భుత సెట్టింగులతో మలిచారు. వేదికల వద్ద స్వాగత ద్వారాలను, తోరణాలను ఏర్పాటుచేశారు. విద్యుత దీపాలతో మండపాలను అలంకరించారు. అయిదడుగుల నుంచి నలభై అడుగుల వరకు పలు చోట్ల విగ్రహాలను ప్రతిష్టించారు. మట్టి, ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ విగ్రహాలను ఏర్పాటు చేశారు. వినాయక ఉత్సవ నిర్వాహకులు పర్యావరణ ప్రాధాన్యంపై అవగాహన కలిగి ఉండటంతో ఈదఫా అధికంగా మట్టి ప్రతిమలను ప్రతిష్ఠించారు.

Updated Date - 2023-09-19T23:44:30+05:30 IST