ఇంటర్ స్పాట్ ప్రారంభం
ABN , First Publish Date - 2023-04-02T00:39:15+05:30 IST
ఇంటర్మిడియట్ వార్షిక పరీక్షలకు సంబంధించిన సమాధాన పత్రాల మూల్యాంకనం ఖమ్మం జిల్లా కేంద్రంలో ప్రారంభమైంది. మార్చి 15న ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు శుక్రవారం ఒకేషనల్ పరీక్షతో ముగిశాయి.
నాలుగు విడతల్లో 4,18,391 పత్రాల మూల్యాంకనం
విధుల్లో 15 వందల మంది అధ్యాపకులు
విధుల కేటాయింపులో సమన్వయ లోపాలు
ఖమ్మం ఖానాపురంహవేలి, ఏప్రిల్ 1: ఇంటర్మిడియట్ వార్షిక పరీక్షలకు సంబంధించిన సమాధాన పత్రాల మూల్యాంకనం ఖమ్మం జిల్లా కేంద్రంలో ప్రారంభమైంది. మార్చి 15న ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు శుక్రవారం ఒకేషనల్ పరీక్షతో ముగిశాయి. ఫలితాలను వీలైనంత ముందుగా ఇవ్వాలని భావించిన ఇంటర్‌బోర్డ్ మూల్యాంకనాన్ని వెంటనే ప్రారంభించింది. నగరంలోని ప్రభుత్వ నయబజార్ జూనియర్ కళాశాలలో మూల్యాంకన కేంద్రాన్ని ఇంటర్ జిల్లా విద్యాఽశాఖ అదికారి రవిబాబు ఏర్పాటు చేశారు. ఇప్పటికే సమాధాన పత్రాల కోడింగ్ ప్రారంభం కాగా, శుక్రవారం మూల్యాంకనం ప్రారంభమైంది. మొత్తం నాలుగు విడతల్లో 4లక్షల, 18 వేల, 391 జవబుపత్రాల మూల్యాంకనం నిర్వహించనున్నారు. 15 వందల మంది అధ్యాపకులు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మూల్యాంకన కేంద్రంలో ఇంటర్ సమాధాన పత్రాలను దిద్దుతున్నారు. ఈ మూల్యాంకనం ఏప్రిల్ 20తో ముగియనున్నది. నాలుగు విడతల్లో ఇంటర్ సమాధాన పత్రాలను దిద్దనున్నారు. ఇంటర్ మూల్యాంకనాన్ని త్వరితగతిన ముగించేందుకు విధులకు హాజరుకావాల్సిందిగా ఇప్పటికే అధ్యాపకులకు ఉత్తర్వులు అందజేశామని జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి తెలిపారు. ఉత్తర్వులు అందిన ప్రతీ అధ్యాపకుడు మూల్యాంకనం విధుల్లో పాల్గొనాల్సి ఉంది. శుక్రవారం తొలి విడతలో సంస్కృతం, తెలుగు, హిందీ, ఇంగ్లిష్, పౌరశాస్త్రం, గణితం సబ్జెక్టుల మూల్యాంకనం ప్రారంభమైంది. ఈ విడతలో 476మంది అధ్యాపకులు పాల్గొంటున్నారు. రెండోవిడత ఏప్రిల్ 4నుంచి ప్రారంభం కానుండగా అర్థశాస్త్రం, ఫిజిక్స్ పేపర్ల మూల్యాంకనం చేయనున్నారు. 6నుంచి మూడో విడత కామర్స్, రసాయన శాస్త్రం, 9నుంచి నాలుగో విడత జంతుశాస్త్రం, వృక్షశాస్త్రం, హిస్టరీ పేపర్ల సమాధాన పత్రాలను అధ్యాపకులు మూల్యాంకనం చేయనున్నారు. ఇప్పటికే మూల్యాంకనం ప్రారంభమైననేపథ్యంలో ఈసారికి ఆనలైన మూల్యాంకనం ఉండదని అధికారులు చెబుతున్నారు. సమాధాన పత్రాల మూల్యాంకనంలో పొరపాట్లు జరగకుండా ప్రతీ ఐదుగురు అధ్యాపకులపై ఒక సీఈ పర్యవేక్షణ ఉండనుంది. ఒక స్ర్కూటినైజర్, ఏసీవో, వెరిఫికేషన్ అధికారులు సమాధాన పత్రాలను పరిశీలిస్తారు. విద్యార్థి రివాల్యుయేషనకు దరఖాస్తు చేసుకుంటే, అందులో అధ్యాపకుడి తప్పు ఉన్నట్టు గుర్తిేస్త జరిమానా విధించడంతో పాటు చర్యలు తీసుకోనున్నారు. ప్రైవేటు కళాశాలల్లో జేఈఈ, ఎంసెట్, నీట్ తరగతుల పేరుతో అధ్యాపకులను రిలీవ్ చేయకపోతే ఆయా కళాశాలలపై చర్యలు తీసుకుంటాం. అంతేగాక అధ్యాపకులు ఎవరైనా విధులకు హాజరుకాకపోతే చర్యలు తప్పవని డీఐఈవో హెచ్చరించారు. కాగా గత రెండు రోజులుగా ప్రారంభమైన ఇంటర్‌మూల్యాకనానికి హజరవుతున్న అధ్యాపకులుకు సరైన అవగాహన కల్పించకపోవడంతో రెండు రోజులుగా కొందరు అధ్యాపకులు మూల్యాంకన కేంద్రానికి వచ్చి తిరిగి వెళ్లిపోతున్నారు. మూల్యాంకనానికి ముందుగానే విధులకు హజరయ్యే అధ్యాపకులకు ఉత్తర్వులు అందించి హజరుకావాలని పేరర్కొంటే ఈ సమస్యలు వచ్చేయి కావని పలువురు మహిళా అధ్యాపకులు వాపోతున్నారు. విధులకు హజరయ్యేందుకు విద్యాశాఖ కార్యాలయంలో అధ్యాపకులు గంటల కొద్దీ నీరీక్షించక తప్పడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈకనైనా అధ్యాపకులకు మూల్యాంకనానికి సంబందించిన విధులు ఒకరోజు ముందుగానే తెలియజేస్తే ఈ నిరీక్షణ లేకుండా ఉంటుందని పలువురు అధ్యాపకులు తెలిపారు.