ఏకుల పోతమ్మ ఆలయంలో మెచ్చా పూజలు
ABN , First Publish Date - 2023-03-22T23:50:50+05:30 IST
మొద్దులగూడెం క్రాస్ రోడ్‌లో గల ఏకుల పోతమ్మ ఆలయంలో బుధవారం అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఉగాది సందర్భంగా పూజలు చేసారు.
దమ్మపేట, మార్చి 22: మొద్దులగూడెం క్రాస్ రోడ్‌లో గల ఏకుల పోతమ్మ ఆలయంలో బుధవారం అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఉగాది సందర్భంగా పూజలు చేసారు. శోభకృత్ నామ సంవత్సరము ప్రజలంతా సుఖ సంతోషాల తో గడపాలని ఎమ్మెల్యే ఆకాక్షించారు. అనంతరం మొద్ధులగూడెం కాలనీలో ఎమ్మెల్యే పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాలనీవాసులు మెచ్చాకు ఘనస్వాగతం పలికారు. అంతకు ముందు ఎమ్మెల్యేను ఆయన నివాసంలో పలు మండలాలకు చెందిన బీఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులు కలిసి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో జడ్పీటిసి పైడి వెంకటేశ్వరరావు, మండలపార్టీ అధ్యక్షులు దొడ్డాకుల రాజేశ్వరరావు, జిల్లారైతు సమన్వయకమిటి అధ్యక్షులు రావు జోగేశ్వరరావు, దొడ్డా రమేష్, ఎంపీటిసి దొడ్డా నాగమణి, సర్పంచ్ సున్నం రాము, బచ్చు సత్యనారాయణ, కోటగిరి పుల్లయ్య బాబు, బాల శ్రీను, యార్లగడ్డ బాబు, పానుగంటి చిట్టిబాబు, వెంపాటి భరత్, తదితరులు వున్నారు.