Pawan: సనాతన ధర్మం.. సోషలిజం రెండూ నడపగలిగేది జనసేన: పవన్
ABN , First Publish Date - 2023-11-23T13:55:48+05:30 IST
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: తాను తెలంగాణలో తిరగక పోయినా జనసేన ఉందంటే మీ అభిమానమేనని, తనది హ్యుమనిజమని, ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న’ దాశరథీ కృష్టమా చార్యులు అంటే తనకు స్ఫూర్తి అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: తాను తెలంగాణ (Telangana)లో తిరగక పోయినా జనసేన (Janasena) ఉందంటే మీ అభిమానమేనని, తనది హ్యుమనిజమని, ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న’ దాశరథీ కృష్టమా చార్యులు (Dasharathi Krishtama Charyu) అంటే తనకు స్ఫూర్తి అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ (BJP), జనసేన (Janasena) తరఫున ఆయన గురువారం కొత్తగూడెం ప్రకాశం గ్రౌండ్స్‌లో జరిగిన సభలో మాట్లాడుతూ.. సనాతన ధర్మం, సోషలిజం రెండూ నడప గలిగేది జనసేన అని, బీఆర్ఎస్ (BRS)ను ఒక్కమాట అనక పోవడానికి కారణం తాను ఇక్కడ తిరగక పోవడమేనని స్పష్టం చేశారు.
దశాబ్దం వేచి చూసానని, ఆంధ్రాలో అరాచకంపై పోరాటానికి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమే తనకు స్ఫూర్తి అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. తెలంగాణలో అణగారిన వర్గాలకు జనసేన అండగా ఉంటోందన్నారు. ప్రధాని మోదీ (PM Modi) నాయకత్వ పటిమ నచ్చి ఆయనకు మద్దతుగా ఉన్నానన్నారు. ఎవ్వరు వచ్చినా రాక పోయినా దక్షిణాది నుంచి మోదీకి మద్దతుగా ఉంటానని అన్నారు.
భవిష్యత్తు యువత అని చెప్పిన గద్దర్‌కు జోహార్లని పవన్ అన్నారు. నిధులు నీళ్ళు నియామకాలు నినాదంతో వచ్చిన తెలంగాణలో అనుకున్న స్థాయిలో లేదని విమర్శించారు. తెలంగాణలో బీసీ నేతను ముఖ్యమంత్రి చేయగలిగేది మోదీ మాత్రమేనని, రెండు తెలుగు రాష్ట్రాల్లో నిత్యం ఎన్నికల వాతావరణం అవాంఛనీయమని అన్నారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని ఆయన ఆకాంక్షించారు. సింగరేణిలో ఉద్యోగాలు రావాలన్నా పేపర్ లీక్స్ లేకుండా ఉండాలంటే బిజేపి రావాలన్నారు. వైఎస్ జల యజ్ఞం దోపిడీ వల్లే తెలంగాణ పోరాటానికికు పునాది పడిందని, కౌలు రైతులను.. రైతులు కాదనడం బాగో లేదన్నారు. ధరణిలో లోపాలున్నాయని, అభివృద్ధి ఆంధ్రాలో జరగక పోతే తెలంగాణ యువత నష్ట పోతుందని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.