Home » Pressmeet
దేశంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సయితం చంద్రబాబు అంటే అభివృద్ధి, నమ్మకానికి బ్రాండ్ అని చెబుతున్నారని, రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని కలిశెట్టి అప్పల నాయుడు అన్నారు. భయం, అసూయతో జగన్ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, నమ్మకం, విశ్వాసం అని జగన్ చెబుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందన్నారు.
రూ.2 కిలో బియ్యంతో ఎన్టీఆర్ ప్రతీ పేదవాడి మనసులో స్థానం సంపాదించుకున్నారని, హైదరాబాద్లో ఐటీని అభివృద్ధి చేసి చంద్రబాబు నాయుడు ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారని, రైతు బాంధవుడిగా ప్రజలు వైఎస్ను గుర్తుంచుకుంటారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
బెల్టు షాపుల మీద ఉక్కు పాదం మోపుతున్నామని, బెల్టు షాపు అనుబంధంగా ఉన్న షాపుల లైసెన్స్ రద్దు చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా దాడులు, హత్యలు, అక్రమ కేసులతో రెచ్చిపోయారని, 44 రోజుల పాటు తాను కూడా రాజమండ్రి జైల్లో ఉన్నానని చెప్పారు.
తమది ఆస్తుల గొడవ కాదని.. స్టూడెంట్ విషయాల్లో ప్రారంభమైన గొడవ అని మంచు మనోజ్ తెలిపారు. తన ఇంట్లో జరిగిన బీభత్సంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. మీరు ఇక్కడ ఉండడం లేదు కదా అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని అన్నారు. ఇప్పటి వరకు మూడు ఎఫ్ఐఆర్లు అయినా పహాడీ షరీఫ్ ఇన్స్పెక్టర్ ఒక్క ఛార్జ్ షాట్ కూడా ఫైల్ చేయలేదుని ఆరోపించారు.
వైఎస్ఆర్సీపీ నేత కారుమూరి నాగేశ్వరరావు టీడీపీ నేతల్ని కొడతాం, చంపుతామని హెచ్చరికలు జారీ చేశారు. ఏలూరులో జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న కారుమూరి ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
హెచ్సీయూ భూముల మీద విచారణ చేయడానికి నటరాజన్ మీనాక్షి ఎవరని.. మంత్రులను ఆమె ఎలా కంట్రోల్ చేస్తారని బండి సంజయ్ ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు రబ్బర్ స్టాంప్లు అని, మంత్రి వర్గం విస్తరణలో ముఖ్యమంత్రిని కాంగ్రెస్ అధిష్టానం పట్టించుకోవడం లేదని విమర్శించారు. బీజేపీ దేశ భక్తి పార్టీ అని.. ఎంఐఎం దేశ ద్రోహ పార్టీ అని ఆయన అభవర్ణించారు.
బాపట్ల జిల్లా విద్యుత్ శాఖ సిబ్బంది మృతిపై మంత్రి గొట్టిపాటి రవి కుమార్ దిగ్భ్రాంతి చెందారు. విధి నిర్వహణలో భాగంగా సిబ్బంది చనిపోవడంపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.
ఆ భూములను వేలం వేయడం కుదరదని.. ఈ విషయం తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భూముల చదను పేరుతో కోర్టు ధిక్కరణకు పాల్పడుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శించారు. చెట్లను తొలగిస్తూ, మొక్కలను పీకేస్తూ పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతోందని ఆరోపించారు. ఆ భూములను డీఫారెస్టైజేషన్ చేసి అమ్మి వేల కోట్లు దండుకోవాలనుకోవడం దుర్మార్గమన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి నడుపుతున్నది ప్రభుత్వమా లేక బుల్డోజర్ కంపెనీనా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. పేద ప్రజల ఇండ్లనిను బుల్డోజర్లతో కూల గొట్టించారని, అభివృద్ధి పేరు చెప్పి తొండలు కూడా గుడ్లు పెట్టని ఎండిన భూములు అంటూ గిరిజన గూడాలపై పడ్డారని విమర్శించారు.
43 ఏళ్లుగా తెలుగు ప్రజలు తమ గుండెల్లో పెట్టుకున్న పార్టీ..మన తెలుగుదేశం పార్టీ అని, ‘అన్న’ నందమూరి తారకరామారావు దివ్య ఆశీస్సులతో... సంచలనంగా ఆవిర్భవించిన తెలుగుదేశం దేదీప్యమానంగా వెలుగుతున్నదంటే అందుకు కారణం కార్యకర్తల తిరుగులేని పోరాటం, నిబద్ధత, త్యాగగుణమేనని సీఎం చంద్రబాబు అన్నారు. పీకపై కత్తిపెట్టినా ‘జై తెలుగుదేశం’ నినాదం తప్ప వేరే మాట వినిపించని గొంతుక ఉండే కార్యకర్తలు ఉన్న ఏకైక రాజకీయ పార్టీ తెలుగుదేశం అని అన్నారు.