వర్షం.. హర్షం !

ABN , First Publish Date - 2023-07-18T23:53:38+05:30 IST

ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మంగళవారం ముసురు కొనసాగింది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం నమోదైంది. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. జిల్లాలో 13.8మిల్లిమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. పినపాక, చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో అత్యధికంగా 25మిల్లీమీటర్ల వర్షం కురిసింది. పలు మండలాల్లో వాగులు వంకల్లోకి నీరు చేరింది. పత్తిపంట ఆశాజనకంగా ఉంది. వరి నారుమళ్లకు పుష్కలంగా నీరుచేరింది. ఇల్లెందు, మణుగూరు, కొత్తగూడెం

వర్షం.. హర్షం !
భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం

ఇరు జిల్లాలో విడవని ముసురు

పలుచోట్ల పొంగినవాగులు, చెరువులకు జలకళ

భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి

తాలిపేరు 22గేట్లు ఎత్తి.. 26,557 క్యూసెక్కుల నీరు విడుదల

కొత్తగూడెం/భద్రాచలం/సత్తుపల్లిరూరల్‌/పెనుబల్లి, జూలై 18 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మంగళవారం ముసురు కొనసాగింది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం నమోదైంది. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. జిల్లాలో 13.8మిల్లిమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. పినపాక, చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో అత్యధికంగా 25మిల్లీమీటర్ల వర్షం కురిసింది. పలు మండలాల్లో వాగులు వంకల్లోకి నీరు చేరింది. పత్తిపంట ఆశాజనకంగా ఉంది. వరి నారుమళ్లకు పుష్కలంగా నీరుచేరింది. ఇల్లెందు, మణుగూరు, కొత్తగూడెం సింగరేణి ఏరియాల్లోని ఓపెనకాస్టు గనుల్లో నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. చర్ల ప్రాంతంలో ఉన్న తాలిపేరు ప్రాజెక్టుకు ఎగువనుంచి వరద వస్తుండడంతో 22గేట్లు రెండు అడుగుల మేర ఎత్తి 26,557 క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం 19.1అడుగులకు నీటిమట్టం చేరింది. స్నాన ఘట్టాల పైకి వరద నీరు చేరింది. నేడు 25అడుగులకు చేరుకునే అవకాశం ఉందని సీడబ్లూసీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ఖమ్మం జిల్లాలోనూ పలుచోట్ల భారీ వర్షం నమోదైంది. సత్తుపల్లి నియోజకవర్గంలో భారీ వర్షం కురవడంతో ఐదు మండలాల్లో వాగులు, వంకలు పొంగి ప్రవహించాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమవ్వగా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వరినాట్లు ఊపందుకున్నాయి. వర్షం కారణంగా చెరువులు, వాగుల సమీపంలో పంట పొలాలు నీటమునిగాయి. కల్లూరు డివిజనలో పెనుబల్లిలో 2.1 సెంటీమీటర్లు, ఏన్కూరు 1.2సెంటీమీటర్‌ వర్షం కురిసింది. సత్తుపల్లి పరిధిలోని జేవీఆర్‌, కిష్టారం ఓసీలోని బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. సుమారు 25వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి, 90వేల క్యూబిక్‌ మీటర్ల మట్టి తీసే పనికి ఆటంకం ఏర్పడిందని అధికారులు తెలిపారు.

Updated Date - 2023-07-18T23:53:38+05:30 IST