టీడీపీ సభ్యత్వ నమోదు ప్రారంభం
ABN , First Publish Date - 2023-03-16T22:49:35+05:30 IST
టీటీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంను గురువారం భద్రాచలంలో టీడీపీ సీనియర్ నాయకులు కంభంపాటి సురేష్ ఇంటి వద్ద ప్రారం భించారు.
భద్రాచలం, మార్చి 16: టీటీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంను గురువారం భద్రాచలంలో టీడీపీ సీనియర్ నాయకులు కంభంపాటి సురేష్ ఇంటి వద్ద ప్రారం భించారు. మొదటి సభ్యత్వాన్ని సురేష్‌కు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర పార్టీ పరిశీలకులు రాజునాయక్, కొండపల్లి రామచంద్రయ్య ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణకు సంక్షేమ పథకాలు అభివృద్ధి చేసిన ఘనత టీడీపీదేనని, తెలంగాణలో తెలుగుదేశానికి పూర్వయోగం కోసం అందరు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం మండల అధ్యక్షులు షేక్ అజీ మ్, కార్యదర్శి తాలూరి చిట్టిబాబు, కొడాలి శ్రీనివాస్, సురేష్, కుంచాల రాజారాం, రాము, చుక్కమ్మ, శశిధర్, అడ్వకేట్ రాంబాబు, రామకృష్ణ, ప్రవీణ్ పాల్గొన్నారు.