ప్రతిష్ఠా మహోత్సవాల్లో పాల్గొన్న తుమ్మల
ABN , First Publish Date - 2023-02-04T23:21:51+05:30 IST
మండలంలోని చిల్లగుంపు గ్రామంలో శనివారం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ ప్రతిష్టా మహోత్సవం, బొడ్రాయి ప్రతిష్టా మహోత్సవ పూజల్లో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు.
దమ్మపేట, ఫిబ్రవరి 4: మండలంలోని చిల్లగుంపు గ్రామంలో శనివారం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ ప్రతిష్టా మహోత్సవం, బొడ్రాయి ప్రతిష్టా మహోత్సవ పూజల్లో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. వేడుకలను హాజరైన మాజీ మంత్రి తుమ్మలకు నిర్వాహకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. ఈసందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ వెంకటేశ్వరరావు, అశ్వారావుపేట బీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు బండి పుల్లారావు, నాయకులు కొయ్యల అచ్యుతరావు, చెలికాని ప్రసాద్, కాసాని నాగప్రసాద్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.