Kodandaram: కోదండరాం నిరసన దీక్ష

ABN , First Publish Date - 2023-01-11T16:26:04+05:30 IST

టీజేఎస్ కార్యాలయంలో టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం (Kodandaram) నిరసన దీక్షకు దిగారు.

Kodandaram: కోదండరాం నిరసన దీక్ష

హైదరాబాద్: టీజేఎస్ కార్యాలయంలో టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం (Kodandaram) నిరసన దీక్షకు దిగారు. కృష్ణానదీ జలాల్లో తెలంగాణ (Telangana) వాటా తేల్చాలని, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని కోదండరాం డిమాండ్ చేశారు. తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా సీఎం కేసీఆర్ (CM KCR) పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ నెల 30న ఢిల్లీకి వెళ్లి కేంద్రాన్ని కలుస్తానని తెలిపారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చాలని కోరుతానని కోదండరాం పేర్కొన్నారు.

కృష్ణా జలాల (Krishna waters)కు సంబంధించి పలు కీలక అంశాలపై తెలుగు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదిరింది. మిగులు జలాలు, జలవిద్యుత్తుకు మార్గదర్శకా లు రూపకల్పనతోపాటు ఆర్డీఎస్‌ (RDS) పై శాస్త్రీయ అధ్యయనానికి ఏపీ, తెలంగాణ అంగీకరించాయి. ఏపీ ఆధీనంలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు మ రమ్మతులకు తన వంతు ఆర్థికసాయం అందించడానికి తెలంగాణ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

Updated Date - 2023-01-11T16:26:12+05:30 IST