దొరల ప్రభుత్వాన్ని దూరం పెడదాం

ABN , First Publish Date - 2023-06-17T23:53:56+05:30 IST

ప్రజలు నడుం బిగించి కదం తొక్కి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించి దొరల ప్రభుత్వాన్ని దూరం పెట్టాలని సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్ర 93వ రోజు శనివారం రాత్రి నల్లగొండ జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్‌ వద్దకు చేరింది.

దొరల ప్రభుత్వాన్ని దూరం పెడదాం

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

తొమ్మిదిన్నరేళ్లలో ఒక్క ఎకరాకు నీరివ్వని సర్కార్‌ : ఎంపీ ఉత్తమ్‌

నల్లగొండ, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి ప్రతిని ధి): ప్రజలు నడుం బిగించి కదం తొక్కి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించి దొరల ప్రభుత్వాన్ని దూరం పెట్టాలని సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్ర 93వ రోజు శనివారం రాత్రి నల్లగొండ జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్‌ వద్దకు చేరింది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌లో భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ప్రభుత్వం నల్లగొం డ జిల్లాలోని ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు వెయ్యి కోట్లు ఖర్చు చేసి ఉంటే 4లక్షల ఎకరాలకు సాగు నీరు వచ్చి ఉండేదన్నారు. కాగా, ప్రభుత్వం ఒక్క రూపా యి కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. కొట్లా డి తెచ్చుకున్న తెలంగాణ లక్ష్యానికి చేరుకోలేకపోయిందని, దీనికి కారణం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే కారణమని ధ్వజమెత్తారు. బీఆర్‌ఎ్‌సను తొలగిస్తేనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని అన్నారు. అధికారంలోకి రాగానే ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఒక్కొక్కరికి రూ.5లక్షలు, రైతుల రుణాలు రూ.2లక్ష లు మాఫీ చేస్తామని, భూమిలేని నిరుపేదలకు రైతుబంధులా కూలీబంధు కింద ఏడాదికి రూ.12వేలు ఇస్తామన్నారు. ఖాళీగా ఉన్న 2లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని, ప్రతీ ఒక్క కుటుంబానికి రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తామన్నారు. దొరల ప్రభుత్వాన్ని పారదోలడానికి ప్రతీ ఒక్కరు సిద్ధం కావాలన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు మంత్రి జగదీ్‌షరెడ్డి ఏ మీ చేయలేదని అన్నారు. జిల్లాకు ఏం చేశారని ప్రశ్నిస్తే ఏటా రెండు పంటలకు నీటిని విడుదల చే స్తున్నామని మంత్రి చెప్పడం విడ్డూరంగా ఉందన్నా రు. గుత్తా సుఖేందర్‌రెడ్డి పొద్దుతిరుగుడు పువ్వులా అధికారం ఉన్న పార్టీలోకి వెళ్తాడని ఎద్దేవా చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డానని చెప్పిన గుత్తా, ఈ తొమ్మిదిన్నరేళ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏమీ చేయకున్నా ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. టీడీపీ నుంచి కాంగ్రె్‌సలోకి, కాంగ్రెస్‌ నుంచి బీఆర్‌ఎ్‌సలోకి మా రడం తప్ప ఆయన చేసిందేమీ లేదన్నారు. నల్లగొం డ జిల్లా అనేక భావజాలాలకు అడ్డా అని, ప్రత్యేక రాష్ట్రం కోసం జిల్లాలో జేఏసీలు ఏర్పాటు చేసుకుని కొట్లాడి తెలంగాణను సాధించారన్నారు. అయితే సా గునీటితో పాటు ఉద్యోగం వస్తుందని ఆశించారని, జీవితాల్లో వెలుగులు వస్తాయని భావిస్తే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు. నక్కలగండి, ఎస్‌ఎల్‌బీసీ, డిండి ఎత్తిపోతల పథకాన్ని ఎం దుకు పూర్తి చేయలేదని, నీళ్ల కోసం తెచ్చుకు న్న తె లంగాణలో దశాబ్ది కాలంగా జిల్లాకు అన్యాయం జరిగిందన్నారు. ఎంతో మంది నిరుద్యోగులు తొమ్మిదిన్నరేళ్లుగా ఉద్యోగాలు రాక రోడ్లపై పిచ్చివాళ్లలా తిరుగుతున్నారని, కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ప్రతీ ఒక్కొరికి న్యాయం చేస్తుందన్నారు. టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌ మాట్లాడుతూ, ఉమ్మడి నల్లగొండ జిల్లాకు తొమ్మిదిన్నరేళ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అదనంగా ఒక్క ఎకరాకు నీరు ఇవ్వలేదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 12 స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించుకుంటామన్నారు. ఎస్‌ఎల్‌బీసీ, నక్కలగండి, డిండి ఎత్తిపోతల పథకం, ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకం ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. ఒక్క ఉద్యోగాన్ని కూడా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం భర్తీ చేయలేకపోయిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం లక్షలాది మందికి ఇళ్లు ఇస్తే వేలల్లో కూడా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇల్లు ఇవ్వలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మోసం చేసిందని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పద్మావతి, డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌, కాంగ్రెస్‌ పట్టణశాఖ అధ్యక్షుడు గుమ్ముల మోహన్‌రెడ్డి, నాయకులు చెరుకు సుధాకర్‌, దుబ్బాక నర్సింహారెడ్డి, వల్లె నారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-17T23:58:58+05:30 IST