Share News

లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ జెండా ఎగరేద్దాం

ABN , Publish Date - Dec 22 , 2023 | 04:16 AM

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరేసేందుకు కలిసికట్టుగా పనిచేద్దామని బీఆర్‌ఎస్‌ వర్కింట్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం తొలిసారి గురువారం బీఆర్‌ఎస్‌ భవన్‌లో జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లతో ఆయన సమావేశమయ్యారు.

లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ జెండా ఎగరేద్దాం

ఇతర పార్టీల వాళ్లు మభ్యపెడితే ఆశపడొద్దు

జీహెచ్‌ఎంసీ పార్టీ కార్పొరేటర్లతో కేటీఆర్‌..

హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): రానున్న లోక్‌సభ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరేసేందుకు కలిసికట్టుగా పనిచేద్దామని బీఆర్‌ఎస్‌ వర్కింట్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం తొలిసారి గురువారం బీఆర్‌ఎస్‌ భవన్‌లో జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లతో ఆయన సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్‌ గెలుపులో కీలక పాత్ర పోషించిన పార్టీ కార్పొరేటర్లకు కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. ‘మీ సమష్టి కృషి వల్లే హైదరాబాద్‌లో మంచి ఫలితాలు వచ్చాయి. కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలతో ఇబ్బందులున్నా.. కార్పొరేటర్లు పార్టీ కోసం పనిచేశారు. ఇది మనకు క్లిష్ట సమయం. ఇతర పార్టీలు మభ్యపెడితే ఆశపడొద్దు. భవిష్యత్తు బీఆర్‌ఎ్‌సదే. మీ అందరికీ కార్పొరేటర్లుగా మరోసారి పోటీ చేసే అవకాశమిస్తాం. 2004 తర్వాత రెండు దశాబ్దాల్లో టీడీపీ కేవలం ఐదేళ్లు మాత్రమే అధికారంలో ఉంది. అయినా చంద్రబాబు పార్టీని కాపాడుకున్నారు. రాజకీయం.. పార్టీ అంటే వెలుగు, చీకటి ఉంటాయి. మనోఽస్థైర్యం కోల్పోకుండా ముందుకుసాగాలి. పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ ఇదే ఊపు కొనసాగించాలి.’ అని అన్నారు.

Updated Date - Dec 22 , 2023 | 04:16 AM