Kumaram Bheem Asifabad: సింగరేణి మనుగడకు కృషి చేద్దాం
ABN , Publish Date - Dec 23 , 2023 | 09:57 PM
సింగరేణి మనుగడకు ఐక్యంగా కృషి చేద్దామని జీఎం రవి ప్రసాద్ అన్నారు. శనివారం గోలేటి భీమన్న స్టేడియంలో సింగరేణి ఆవిర్భావ వేడుకలను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
రెబ్బెన, డిసెంబరు 23: సింగరేణి మనుగడకు ఐక్యంగా కృషి చేద్దామని జీఎం రవి ప్రసాద్ అన్నారు. శనివారం గోలేటి భీమన్న స్టేడియంలో సింగరేణి ఆవిర్భావ వేడుకలను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో సింగరేణి సంస్థకు అత్యంత ప్రాధాన్యం ఉందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టకొని కార్మికులు, అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. ఈ సందర్భంగా సింగరేణి పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పలు స్టాళ్లను పరిశీలించారు. కార్యక్రమంలో ఎస్‌ఓటు జీఎం నరేందర్, సేవా ఉపాధ్యక్షురాలు నలిని నరేందర్, ఎజీఎం తిర్మల్‌రావు, డీజీఎం భీంరావుజాడే, డీవైసీఎంఓ శౌరి, అధికారులు నవనీత, రాజేంద్ర ప్రసాద్, వర ప్రసాద్, కృష్ణమూర్తి, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.