Share News

ఈఎ్‌సఐ ఆస్పత్రికి తాళం

ABN , First Publish Date - 2023-12-11T23:37:33+05:30 IST

కార్మికులు, వారి కుటుంబాలకు వైద్య సేవలందించాలన్న ఉద్దేశంతో మేడ్చల్‌లో 18 ఏళ్ల కిత్రం ఈఎ్‌సఐ ఆస్పత్రి ఏర్పాటు చేశారు. ఈ ఆస్పత్రి నిర్వహణ అద్దె భవనంలో కొనసాగుతోంది. అయితే ఆస్పత్రి భవనానికి సంబంధించి అద్దె చెల్లించకపోవడంతో కొద్ది రోజలుగా మూతపడింది.

 ఈఎ్‌సఐ  ఆస్పత్రికి తాళం

అద్దె చెల్లించక పోవడంతో 19 రోజులుగా వైద్య సేవలు బంద్‌

ఇబ్బందులు పడుతున్న రోగులు

మేడ్చల్‌ టౌన్‌, డిసెంబరు 11 : కార్మికులు, వారి కుటుంబాలకు వైద్య సేవలందించాలన్న ఉద్దేశంతో మేడ్చల్‌లో 18 ఏళ్ల కిత్రం ఈఎ్‌సఐ ఆస్పత్రి ఏర్పాటు చేశారు. ఈ ఆస్పత్రి నిర్వహణ అద్దె భవనంలో కొనసాగుతోంది. అయితే ఆస్పత్రి భవనానికి సంబంధించి అద్దె చెల్లించకపోవడంతో కొద్ది రోజలుగా మూతపడింది. ఈ ఆసుపత్రిలో ప్రతిరోజూ 250 మంది రోగులకు వైద్య సేవలు అందుతాయి. 19 రోజలుగా ఆస్పత్రికి తాళం వేసి ఉండడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి చేయూత(ఆరోగ్యశీ) ద్వారా రోగులకు మెరుగైన వైద్యసేవలందించేందుకు ఒక పక్క చర్యలు తీసుకుంటుండగా, మరో పక్క ఈఎ్‌సఐ రోగుల గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. 18 ఏళ్ల కిత్రం మేడ్చల్‌లో పట్టణంలోని వినాయక్‌నగర్‌ కాలనీలోని ఓ భవనంలో ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. అధికారులు నెలనెలా కిరాయి చెల్లిస్తూ వచ్చారు. కాగా 2022 నవంబరు, డిసెంబరు నెలలకు సంబంధించిన అద్దె చెల్లించే విషయంలో ఈఎ్‌సఐ అధికారుల తరపున జాప్యం జరిగింది. పెండింగ్‌లో ఉన్న రెండు నెలల అద్దె తనకు వెంటనే చెల్లించాలని భవనం యజమాని ఆసుపత్రి వారిపై ౖఒత్తిడి తేగా, అధికారులు ఈ విషయాన్ని ఉన్నత అధికారులకు తెలపగా, తర్వలోనే చెల్లిస్తామని చెప్పడంతో భవన యజమాని ఈ ఏడాదికి సంబంధించి జనవరి, ఫిబ్రవరి నెలల అద్దెను స్వీకరించాడు. అనంతరం మార్చిలో భవనం అద్దె లీజ్‌డీడ్‌ రెన్యూవల్‌ చేయాల్సి ఉండగా తనకు రావాల్సిన అద్దె బకాయిలు చెల్లించాలని భవన యజమాని పట్టుబట్టాడు. దీంతో రెన్యూవల్‌ ఆగిపోవడంంతో ఆ నెల నుంచి అద్దె చెల్లింపులు ఆగిపోయాయి. దీంతో భవన యజమాని నవంబరు 22న ఆసుపత్రికి తాళం వేశారు. 19 రోజులుగా మూతపడడంతో రోగులు వచ్చిపోతున్నారు. వైద్యం అందక దిక్కుతోచనిస్థితిలో ఉన్నారు. దీనిపై ఈఎ్‌సఐ ఆసుపత్రి జూనియర్‌ అసెస్టెంట్‌ అశ్విని కుమార్‌ను వివరణ కోరగా గతేడాది రెండునెలల బిల్లులు క్లియర్‌ కాలేదని, ఈఏడాది జనవరి, ఫిబ్రవరి నెలలకు అద్దె చెల్లించామన్నారు. మార్చిలో అగ్రిమెంట్‌ రెన్యూవల్‌ చేయకపోవడంతో ఈ ఏడాది పదినెలలతో పాటు గతేడాది రెండు నెలల అద్దె బిల్లులు ఆగిపోయాయి. బిల్డింగ్‌ యజమానికి పలు మార్లు చెప్పినా పట్టించుకోలేదన్నారు. మార్చినెల నుంచి అద్దె బిల్లులు మంజూరయ్యాని లీజ్‌డీడ్‌పై సంతకం చేస్తే ఖాతాలో డబ్బులు పడతాయన్నారు. దీనిపై భవన యజమాని స్పందిస్తూ ప్రతి నెల రూ.26,802 భవనానికి అద్దె చెల్లించాలి. ఈ ఏడాది పదినెలలు, గతేడాదిలో రెండు నెలల బిల్లులు కలిపి 12 నెలల కిరాయి రావాలని, అద్దె చెల్లించక పోవటంతో ఆసుపత్రికి తాళం వేసినట్టు భవనం యజమాని తెలిపారు. ఈఎ్‌సఎఐ సిబ్బందికి చెప్పినా పట్టించుకోక పోవటంతో తాళం వేయాల్సి వచ్చిందని యజమాని తెలిపారు. అద్దె విషయంలో ఎవరివాదనలు వారు వినిపిస్తున్నప్పటికీ రోగులకు మాత్రం ఇబ్బందులు తప్పటం లేదు.

Updated Date - 2023-12-11T23:37:34+05:30 IST