మండలాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తా
ABN , Publish Date - Dec 26 , 2023 | 10:48 PM
మండలాన్ని అన్నివిధాలుగా అభివృద్ది చేస్తానని నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు.

- నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి
కోయిలకొండ, డిసెంబరు 26 : మండలాన్ని అన్నివిధాలుగా అభివృద్ది చేస్తానని నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు. మంగళవారం ఆమె మండలంలోని ఆచార్యపూర్ గ్రామ పంచాయతీలో గల గాంధీనగర్ సమీపంలోని దత్తాత్రేయ స్వామి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మండలంలోని దేవాలయాలను అభివృద్ధి చేస్తానని తెలిపారు. అన్ని పార్టీల వారు అభివృద్ధికి సహకరించాలని కోరారు. అందరు కలిసి పని చేస్తేనే గ్రామాలు అభివృద్ది చెం దుతాయని తెలిపారు. అందరు సహకరిస్తారని ఆశిస్తున్నానని అభిప్రాపయ డ్డారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రవి, మాజీ ఎంపీటీసీ సభ్యుడు యాదవ్‌కుమార్, నాగరాజు, నారాయణ, రాములు నాయక్, వెంకట్‌రాములు, గంగాధర్, దేవేందర్, విక్రం, సతీష్, వెంకటేష్, గోవిందు, ప్రభాకర్ పాల్గొన్నారు.